DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి కేంద్రాల మేనేజింగ్ ట్రస్టీ గా రత్నాకర్ ఎన్నిక

ఏకగ్రీవంగా తీర్మానించిన సత్యసాయి సంస్థల సెంట్రల్ కమిటీ 

దేశ విదేశాల నుంచి రత్నాకర్ కు అభినందనల వెల్లువ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం). . .

విశాఖపట్నం, జనవరి  16, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రపంచ ఆధ్యాత్మిక రంగంలో క్రమశిక్షణకు మార్గదర్శకంగా నిలిచినా సత్యసాయి సేవ సంస్థలకు మేనేజింగ్ ట్రస్టీ

గా ఆర్ జె రత్నాకర్ నియమితులయ్యారు. గురువారం జరిగిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ బోర్డు సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. సత్యసాయి మేనేజింగ్

ట్రస్టీ గా నియమితులైన రత్నాకర్ కు దేశ విదేశాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల సత్యసాయి సేవ సంస్థల ప్రతినిధుల నుంచి అభినందనలు వెల్లువవుతున్నాయి. ఈ మేరకు

సత్యసాయి సేవా సంస్థలు - ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర పత్రిక సంబంధాల అధికారి ద్వారం స్వామి రత్నాకర్ కు అభినందనలు తెలిపారు.   

ఆంధ్ర

ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గల అతి కుగ్రామం పుట్టపర్తి లో ప్రారంభమైన ఈ సేవ సంస్థల ప్రస్థానం ఆనతి కాలంలోనే దేశ విదేశాల్లో అత్యంత ప్రసిద్ధికెక్కిన

క్రమశిక్షణ, సేవా భావం కల్గిన ఆధ్యాత్మిక సేవ సంస్థగా ప్రఖ్యాతిగాంచింది. సత్య సాయి సూచనలు, మార్గదర్శకం ఆదర్శం గా లక్షలాది మంది భక్తులు తమ పరిధిలో ఎన్నో

సేవాకార్యక్రమాలు విస్తరించి ప్రజలకు ఉచిత సేవలను అందిస్తున్నారు. కేంద్ర కమిటీ పరిధిలో కేజీ నుంచి పీజీ వరకూ, ఆపై పిహెచ్ది వరకూ విద్యా విధానాన్ని అందిస్తూ

డీమ్డ్ విశ్వ విద్యాలయం గా రూపుదిద్దుకుంది. అన్నార్తులకు ఆహారం అందించే నారాయణ సేవ ప్రతి గ్రామం లోనూ నిత్యమూ జరుగుతూనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన

రోగాలకు సైతం ఉచితం గా చికిత్స, ఆపై శాస్త్ర చికిత్సలను అందించేందుకు శ్రీ సత్యసాయి సూపర్ స్పెషలిటీస్ ఆసుపత్రిని సైతం పుట్టపర్తి లోనే నెలకొల్పి లక్షలాది

మందికి ఆరోగ్యాన్ని అందిస్తున్న ప్రత్యక్ష ధన్వంతరి సత్యసాయి à°—à°¾  à°¦à±‡à°¶, విదేశాధినేతలు, వైద్యులు, భక్తులు, వ్యాధిగ్రస్తులచే 
నేటికీ కొనియాడబడుతున్నారు. ఇలా

విశ్వాంతరాలకు విస్తరించిన సత్యసాయి సేవ సంస్థలకు మెజెజింగ్ ట్రస్టీ గా సేవలందించేందుకు ఎన్నో అర్హతలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ఈ మేరకు సత్యసాయి సేవ సంస్థ ల

కేంద్ర కమిటీ గురువారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా రత్నాకర్ పేరును సూచించింది.  

 à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ వరకూ సత్యసాయి కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న ఆర్ జె రత్నాకర్

సత్య సాయి బాబా (సత్యనారాయణ రాజు) సోదరుడు ఆర్ వి జానకి రామయ్య పుత్రుడు. రత్నాకర్ కు బాబాతో రక్త సంబంధమే కాక, సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల పూర్వ విద్యార్థి కూడా.

 à°°à°¤à±à°¨à°¾à°•à°°à± శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ నుండి 1991 లో ఎంబీఏ  à°ªà°Ÿà±à°Ÿà°­à°¦à±à°°à±à°¡à°¯à±à°¯à°¾à°¡à±. విద్యార్థిగా 1990 సంవత్సరంలో అతనికి "ఆల్ రౌండర్ బంగారు పతకం"

 à°•à±‚à°¡à°¾  à°²à°­à°¿à°‚చింది. సత్యసాయి ఆదేశాల మేరకు అతను బెంగుళూరులోని కార్పొరేట్ ప్రపంచంలో à°’à°• దశాబ్దం గడిపి తద్వారా  à°’à°• సంస్థ యొక్క వివిధ అంశాలను మరియు పని శైలిని

 à°…ర్థం  à°šà±‡à°¸à±à°•à±à°¨à±à°¨à°¾à°°à±.

2003 సత్యసాయి సూచనల మేరకు  à°ªà±à°Ÿà±à°Ÿà°ªà°°à±à°¤à°¿à°•à°¿ తిరిగి వచ్చి  à°ªà±à°°à°¶à°¾à°‚తి నిలయం యొక్క ఆధ్యాత్మిక మరియు సేవా కార్యకలాపాలతో చురుకుగా

పాల్గొంటున్నారు.  à°®à±Šà°¦à°Ÿà°¿ నియామకంగా పుట్టపర్తి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల ఛైర్మన్‌à°—à°¾ నియమించారు.

తదుపరి మార్చి 2010 లో, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు శ్రీ

రత్నాకర్ ను  à°¶à±à°°à±€ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ యొక్క ధర్మకర్తగా (ట్రస్టీ)  à°†à°¶à±€à°°à±à°µà°¦à°¿à°‚చారు. ప్రస్తుతం ఆయన శ్రీ సత్యసాయి సాధన ట్రస్ట్ మరియు శ్రీ సత్యసాయి

ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ( పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ) యొక్క ట్రస్టీగా కూడా సేవలు అందిస్తున్నారు. 

సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యునిగా, సంస్థ

నిర్వహణలో ప్రారంభించిన సేవా ప్రాజెక్టులలో చురుకుగా పాల్గొన్నారు. చిన్నతనం నుంచి సత్యసాయి కనుసన్నల్లోనే పెరిగి, క్రమ శిక్షణ కల్గిన కార్యకర్తగా అన్ని

హోదాల్లో పనిచేసేందుకు పూర్తిస్థాయి శిక్షణ పొందారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam