DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ సాగర తీరం లో గణతంత్ర దినోత్సవానికి భారీ ఏర్పాట్లు 

నౌకాదళం సహా అన్ని విభాగాల భాగస్వామ్యం. .. 

విశాఖ బీచ్ రోడ్ లో ఆకట్టుకుంటున్న పెరేడ్ సాధన. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, జనవరి  19, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం లో ఈనెల 26 à°¨ జరిగే భారత  à°—ణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు విశాఖపట్నం

జిల్లా కలెక్టర్ వినయచంద్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 
నౌకాదళ అధికారులు, నగర పోలీసు అధికారులతో కలిసినిర్వహించిన సమీక్ష సమావేశం లో ఆయన

మాట్లాడుతూ ఈ వేడుకల్లో భారత తూర్పు నావికాదళం సహా, రాష్ట్ర ప్రభుత్వ అన్ని శాఖలూ పాల్గొంటాయన్నారు. నౌకాదళం కూడా పాల్గొనడంతో విశాఖ గణతంత్ర దినోత్సవాలకు మరింత

శోభ సమకూరుతుందని అన్నారు. రేపటినుండి సన్నాహక కార్యక్రమాల లో నేవీ బృందం కూడా  à°ªà°¾à°²à±à°—ొంటుందని తెలిపారు. 

“శకటాల” పై సమాచార అధికారులతో

సమీక్ష

గణతంత్ర దినోత్సవాల లో వివిధ శాఖల ద్వారా నిర్వహించే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు వివిధ శాఖలకు చెందిన శకటాల

తయారీపై విజయవాడ నుండి వచ్చిన సమాచార శాఖ అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకుల తో కలెక్టరు క్షుణ్నంగాసమీక్షించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పై సవివరమైన

ప్రదర్శనలు ఆకర్షణీయంగా ఉండాలన్నారు. నవరత్నాలు అమ్మ à°’à°¡à°¿ నాడు నేడు పేదలందరికీ ఇల్లు మొదలైన పథకాలను అందరికీ అర్థమయ్యేలా వివరించాలన్నారు.  à°¸à°®à°¾à°šà°¾à°° శాఖ అడిషనల్

డైరెక్టర్ డి శ్రీనివాస్ మాట్లాడుతూ వి ఎం ఆర్ డి ఎ కు చెందిన ఎంజీఎం మైదానంలో శకటాల తయారీని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సమాచార శాఖ కమిషనర్ టీ విజయకుమార్

రెడ్డి వివిధ శాఖల వారితో చర్చించి వారికి సూచనలు చేశారని తెలిపారు. సమాచార అధికారులు పర్యవేక్షణలో శకటాలు పొందుతున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో

జాయింట్ కలెక్టర్ యమ్. వేణుగోపాలరావు అడిషనల్ సిపి రంగారెడ్డి ప్రోటోకాల్ కార్యదర్శి మురళి ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్ ఆర్డీవో పెంచల

కిషోర్, నౌకాదళ అధికారులు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam