DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సచివాలయం ఎమ్మెల్సీ వాహనాలపై స్టిక్కర్ల లొల్లి. . 

టిడిపి ఎమ్మెల్సీలను ఫైర్ స్టేషన్ వద్ద  à°…డ్డుకున్న పోలీసులు  

వాహనాలకు స్టిక్కర్ లేదని ఎమ్మెల్సీ à°² నిలువరింత 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి): . . . .

అమరావతి, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం ఎమ్మెల్సీ వాహనాలపై స్టిక్కర్ల లొల్లి కారణం à°—à°¾ తెలుగుదేశం ఎమ్మెల్సీలను ఫైర్ స్టేషన్ వద్ద

పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం ఉదయం సభకు వెళ్తున్న టిడిపి ఎమ్మెల్సీల వాహనాలకు అధికారిక స్టిక్కర్ లేదని సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద పోలీసులు

ఆపడంతో à°‰à°¦à±à°°à°¿à°•à±à°¤à°¤ నెలకొంది. ఎమ్మెల్సీ స్టిక్కర్ లేకుండా ఎలా వస్తారని పోలీసులు ప్రశ్నించారు. అయితే సభ్యులు కారులో ఉంటే స్టిక్కర్లు ఎందుకని ఎమ్మెల్సీలు

మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్సీలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు మూడు రాజధానుల బిల్లుకు టీడీపీ బ్రేకులు వేసింది.

 à°¶à°¾à°¸à°¨à°®à°‚డలిలో  à°µà±à°¯à±‚హాత్మకంగా ముందుకు వెళ్లిన టీడీపీ రూల్ 71తో బిల్లులకు అడ్డుకట్ట వేసింది. 

కాగా బిల్లుల ప్రవేశానికి అనుమతి పొందేందుకే వైసీపీ

విశ్వప్రయత్నాలు చేసింది. బీజేపీ, పీడీఎస్‌ సభ్యులు కూడా జోక్యం చేసుకుని... బిల్లులను తీసుకోవాలని కోరారు. దీంతో నిన్న సాయంత్రం 6.21 గంటలకు చైర్మన్ బిల్లులను

తీసుకున్నారు. కొద్దిసేపటికి రూల్‌ 71పై చర్చ మొదలై వాడివేడిగా కొనసాగింది. రాత్రి 10.10 à°—à°‚à°Ÿà°² సమయంలో à°ˆ తీర్మానాన్ని మండలి ఆమోదించింది. ఉదయం 71 నిబంధనను తెరపైకి

తెచ్చిన టీడీపీ... రాత్రి ‘సెలెక్ట్‌ కమిటీ’ వ్యూహాన్ని సంధించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే బిల్లులపై చర్చ తర్వాత వీటిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటూ మండలి

చైర్మన్‌కు లేఖ అందించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam