DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మండలి చైర్మన్ ఈ రోజు తప్పు చేసారు : బీజేపీ ఎమ్మెల్సీ లు 

టిడిపి నుంచి చైర్మన్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు, 

విశేష అధికారం వాడొద్దని మండలి చైర్మన్ కు చెప్పాం :

విశేష అధికారం వాడితే రాజకీయ సంక్షోభం

వస్తూందన్నాం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాజధానుల అంశం పై బిల్లు చర్చకు వచ్చిన సమయంలో

తుది నిర్ణయం తీసుకునే సమయంలో శాసన మండలి చైర్మన్ షరీఫ్ తప్పు చేశారని,  à°­à°¾à°°à°¤à±€à°¯ జనతా పార్టీ ఎమ్మెల్సీ లు పివిఎన్ మాధవ్, సోము వీర్రాజు తెలిపారు. బుధవారం జరిగిన

మండలి సమావేశం అనంతరం ఎంఎల్ సి లు బయటకు వచ్చిన అనంతరం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ విశేష అధికారాలను ఎట్టిపరిస్థితుల్లోనూ

వినియోగించవద్దని శాసన మండలి చైర్మన్ కు తాము చెప్పమని, అది రాజకీయ సంక్షోభానికి దారి తీస్తుందని వివరించినట్టు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ లు మాధవ్, వీర్రాజు

తెలిపారు. సభా సమయంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, ఇతర నేతలు ప్రేక్షకుల గ్యాలరీల్లోనే కూర్చోడంతో చైర్మన్ షరీఫ్ తీవ్ర ప్రభావితానికి గురయ్యారన్నారు.  à°ˆ

రోజు జరిగిన అంశాన్ని తానూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam