DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమగ్ర సమాచారంతోనే శకటాల ప్రదర్శన జరగాలి: కలెక్టర్ నివాస్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం జిల్లాలోని వివిధ శాఖల ప్రగతిని తెలియజేసే శకటాల

ప్రదర్శనలో ఆయా శాఖల పూర్తి సమాచారం ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో

గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. à°ˆ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ  à°—ణతంత్ర దినోత్సవం ఏర్పాట్లు పక్కాగా ఉండాలని,

వేడుకలను ఘనంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఉంటుందని, ఆ ప్రదర్శనలో

శాఖల ప్రగతిని తెలియజేసే పూర్తి సమాచారం ఉండేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు శాఖలు సాధించిన ప్రగతి, ప్రభుత్వ పథకాలు అమలుపై ప్రజలకు

అవగాహన కలిగేవిధంగా ప్రదర్శనశాలలు ( స్టాల్స్ ) ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా  à°ªà±à°°à°­à±à°¤à±à°µ శాఖల ద్వారా లబ్ధిదారులకు పంపిణీచేయనున్న పరికరాలు, పనిముట్లు,

ఆస్తులు వంటివి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసారు. వేడుకలకు ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా అన్నిఏర్పాట్లను సంబంధిత అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని

సూచించారు. 
à°ˆ సమావేశంలో శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఏ.కళ్యాణ చక్రవర్తి,  à°¬à°¿.సి కార్పొరేషన్

కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు,  à°œà°¿à°²à±à°²à°¾ పంచాయతీ అధికారి వి.రవికుమార్, à°‡.పి.à°¡à°¿.సి.యల్ పర్యవేక్షక ఇంజినీర్ à°Žà°‚.రమేష్, గ్రామీణ నీటిసరఫరా విభాగం పర్యవేక్షక

ఇంజినీర్ టి.శ్రీనివాసరావు, వంశధార పర్యవేక్షక ఇంజినీర్ పి.రంగారావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ బి.రాంబాబు, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి ప్రసన్న కుమార్,

వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, నగరపాలక సంస్థ కమీషనర్ ఎం.గీతాదేవి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.చక్రధర రావు, జిల్లా వైద్య ఆరోగ్య

శాఖాధికారి డా. ఎం.చెంచయ్య, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్త సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam