DNS Media | Latest News, Breaking News And Update In Telugu

20 గ్రాముల బంగారం లెక్క చెప్పకుండానే నోట్ విడుదల

సింహాచల ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్య ధోరణి బట్టబయలు 

ఒకే ఆలయం . . . ఒకే పీఆరో ...ఒకే కార్యక్రమం. . . రెండు ప్రెస్ నోట్లు 

వివరాలు తెలుసుకోకుండానే . . ఇదే

సింహాచలం ఆలయం  à°µà±ˆà°–à°°à°¿  .

వచ్చింది 29 గ్రా. బంగారం, నోట్ లో చూపింది  9 గ్రాములే.    

అధికారులు చెప్తే గానే 20 గ్రా. బంగారం తగ్గిందని తెలియలేదు. 

(DNS

రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం, సింహాచలంలో సిబ్బంది నిర్లక్ష్య

వైఖరి మరో సారి బట్టబయలు అయ్యింది. బుధవారం జరిగిన ఆలయ హుండీల ఆదాయ లెక్కింపు పై ఆలయ పత్రికా సంబంధాల అధికారి విడుదల చేసిన నోట్ లో బంగారం 9 గ్రాములు మాత్రమే

ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర వివరాలకోసం మీడియా ఆలయ అధికారులను సంప్రదించగా హుండీ ల్లో ముడుపుల రూపం లో వచ్చిన బంగారం 29 గ్రాములు à°—à°¾ తేలింది.  à°®à±€à°¡à°¿à°¯à°¾ పీఆరో నుంచి

వచ్చిన సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా తిరిగి తర్వాత మరో నోట్ విడుదల అయ్యింది. దీంతో ఒకే కార్యక్రమానికి రెండు ప్రెస్ నోట్లు విడుదల

చేసేసారు. 

ఆలయంలో ఆదాయ లెక్కింపు ముగిసిన తర్వాత అధికారులు ఇచ్చిన వివరాలను పూర్తిగా తెలుసుకోకుండానే ప్రెస్ నోట్ విడుదల చేసేసారు. దీని ప్రకారం ఆదాయం

కోటి రూపాయలతో పాటు, బంగారం 9 గ్రాములు హుండీ లో ముడుపులు వచ్చినట్టు ఉంది. ఆలయ అధికారుల నుంచి సమాచారం సేకరించిన మీడియా కు హుండీ లో ముడుపుల ద్వారా వచ్చిన బంగారం 29

గ్రాములు అని తేలింది. ప్రజలకు అందించే సమాచారం వివరాలను పూర్తిగా తెలుసుకోకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారా లేక మిగిలిన బంగారం కావాలనే ప్రెస్ నోట్ లో

ఇవ్వలేదా అనే విషయం అధికారులే తేల్చాల్సి ఉంది. 

ఆలయంలో ముగ్గురు సిబ్బంది పత్రికా సంబంధాల విభాగం లో విధులు నిర్వహిస్తున్నారు. ఆలయం కు సంబంధించి

వివరాలను పత్రికల ద్వారా ప్రజలకు సమాచారం అందించవలసిన భాద్యత ఉన్న వీళ్ళు ఆలయ అధికారుల నుంచి పూర్తి వివరాలను తెలుసుకోవడం లో పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో

ఉన్నారనడానికి ఇదే పెద్ద నిదర్శనం. 

గతంలోనూ ఇలాంటి ఘటనలే చాలా ఎదురయ్యాయి. ఆలయ అధికారులు ఇచ్చే సమాచారం ఒకటి, ఈ విభాగం నుంచి మీడియా కు చేరే సమాచారం

మరొకటిగా తేలింది. ఇలా అసంపూర్ణ సమాచారాన్ని ఇచ్చే à°ˆ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చెయ్యాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam