DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిబ్రవరి 1 నుండి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ 

జిల్లాలో 79 పరీక్షా కేంద్రాలు, 38 , 828  à°µà±‡à°² విద్యార్థులు 

ఇంటర్ పరీక్షలు పై అధికారులతో డిఆర్ఓ సమీక్ష   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, జనవరి  23, 2020 (డిఎన్‌ఎస్‌) : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1à°µ తేదీ నుండి ఫిబ్రవరి 20à°µ తేదీ వరకు ఉంటాయని జిల్లా రెవెన్యూ అధికారి à°Žà°‚

శ్రీదేవి పేర్కొన్నారు.  à°—ురువారం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ ఛాంబర్ లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. à°ˆ

సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాక్టికల్స్ పరీక్షలో జంబ్లింగ్ ఉంటుందన్నారు. జిల్లాలో 79 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, ఇందులో విశాఖపట్నం నగర పరిధిలో 54, గ్రామీణ

మరియు ఏజన్సీ లో కలిపి 25 పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు చెప్పారు. పరీక్షలకు 38 వేల 828 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. 9 కేంద్రాలను సమస్యాత్మకమైన

కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఇందులో జికె వీది, కృష్ణ దేవి పేట, జి. మాడుగుల, చింతపల్లి, పెదబయలు ల్లో ఒక్కొక్కటి, అరకు, పాడేరు ల్లో రెండేసి ఉన్నట్లు

వివరించారు. à°ˆ నెల 28à°µ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పై ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష  à°‰à°‚టుందని, à°ˆ పరీక్ష ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుండి 1 à°—à°‚à°Ÿà°² వరకు

ఉంటుందన్నారు. 30 తేదీన పర్యావరణంపై ఉంటుందని చెప్పారు. థియరీ పరీక్షలు మార్చి 4వ తేదీ నుండి ఉంటాయని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు

చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. డిప్యూటీ తహసీల్దార్ లను

ఫ్లైయింగ్ స్క్వేడ్, సిట్టింగ్ స్క్వేడ్ లను నియమించినట్లు పేర్కొన్నారు. 
పరీక్షా కేంద్రాలకు ఆర్.టి.సి. బస్సులు 13రూట్లులో వేయాలని ఆర్. టి. సి. అధికారులను,

పరీక్ష కేంద్రాల వద్ద పారిశుధ్యం నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, ప్రధమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు, విద్యుత్, తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత

అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్. ఐ. ఓ. బి. సుజాత, డివిఇఓ ఎంవిఎన్ పాత్రుడు, సి విభాగం పర్యవేక్షకులు ఎంవిఎస్ లోకేశ్వరరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam