DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆడపిల్లను కాదనడం అంటే అమ్మను కాదన్నట్టే: మంత్రి ధర్మాన  

కేంద్ర ప్రభుత్వ క్షేత్ర ప్రచార విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాలు 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . . .

శ్రీకాకుళం, జనవరి  24, 2020

(డిఎన్‌ఎస్‌) : ఆడపిల్లను కాదనడం అంటే అమ్మను కాలదన్నుకున్నట్లేనని  à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జాతీయ బాలికల

దినోత్సవం పురస్కరించుకొని నేడు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు భారత ప్రభుత్వ సమాచార ప్రసార సంబంధాల మంత్రిత్వ శాఖ

క్షేత్ర ప్రచార విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్ధులు, వివిధ విభాగాల అధికారులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీని

జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, బాలికలపై వివక్ష చూపడం అంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం అన్న విషయాన్ని మనమంతా గమనించాలని

తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీ జె.నివాస్ గారు మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయాన్ని అందించడం, నేరస్ధులకు 21 రోజులలోగా శిక్షణను అమలు చేయడమే దిశ చట్టం

ఉద్దేశమని అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్ ను దిశ కేంద్రంగా మార్చడం జరిగిందని తెలిపారు. 

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల

క్షేత్రప్రచార అధికారి సూరునేని శ్రీధర్ మాట్లాడుతూ, `బాలికలపై వివక్ష చూపడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఇది ఇలాగే కొనసాగితే సమాజం అనాథగా మిగులుతుంది. ఆ

తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా మనమంతా మేల్కోవాలి. ఆడపిల్లను రక్షించుకోవాలి.' - బేటీ బచావో... బేటీ పడావో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా భారత

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ప్రకటించారని తెలిపారు. కేంద్రప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ

సందర్భంగా గౌరవ రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్... కలెక్టర్ జె.నివాస్, జాతీయ స్థాయిలో విజేతులుగా నిలిచిన క్రీడాకారులను అభినందిస్తూ

వారికి బహుమతులు ప్రదానం చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam