DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ శాసన మండలి రద్దు ఖాయంగానే ఉందా?

మండలి లో బయలు దేరిన బిల్లు ఎక్కడుంది? . . .

మంగళం పడేందుకు à°°à°‚à°—à°‚ సిధ్దం అవుతోందా . . . .  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . .

అమరావతి, జనవరి  25, 2020

(డిఎన్‌ఎస్‌) : ఏపీ శాసన మండలి రద్దుకు అధికార పార్టీ కృతనిశ్చయమై పోయిందా అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. అందుకు అవసరమైన కార్యాచరణ వేగవంతం చేసింది. సోమవారం

అత్యవసర క్యాబినెట్ భేటీ వెంటనే అసెంబ్లీ సమావేశం నిర్వహించి మండలి భవితవ్యాన్ని నిర్ణయించనుంది. శాసనసభలో సుదీర్ఘ చర్చ నిర్వహించి చివర్లో తీర్మానం చేసి

కేంద్రానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శాసనమండలిలో తగిలిన ఎదురుదెబ్బ అధికారపక్షం తీవ్రంగా పరిగణిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో

భారీ మ్యాండేట్ సాధించినా.. ప్రతిపక్షం మెజారిటీ ఉన్న మండలిలో ఎదురవుతున్న పరిణామాలపై వైసీపీ సీరియస్ గా ఉంది. మూడు రాజధానులు, సిఆర్డీఏ బిల్లులే కాకుండా ఇంతకు

ముందు ఎస్సీ,ఎస్టీ బిల్లు, ఇంగ్లీష్ మీడియం బిల్లులకు కూడా మండలి అడ్డుతగిలింది. అప్పుడే మండలి రద్దు చేయాలన్న అంశం చర్చకు వచ్చినా తొందరపాటు అవుతుందన్న భావనతో

విరమించుకున్నారు. అయితే మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల విషయంలో  à°°à±†à°‚డు రోజులుగా మండలిలో జరిగిన వ్యవహారం అధికారపక్షానికి రాజకీయంగా ఎదురుదెబ్బ

తగలింది. 

మండలిలో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ ఛైర్మెన్ నిర్ణయం తీసుకోవడంతో అధికారపక్షం షాక్ కు గురయ్యింది. మండలి పరిణామాలపై సిఎం జగన్ తో

పాటు సీనియర్ మంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి జగన్ తో పలువురు మంత్రులు, సీనియర్లు వరుస భేటీలు నిర్వహించారు. చివరికి మండలి రద్దు

చేయాలన్న నిర్ణయానికి వచ్చి శాసనసభ వేదికగా మండలిలో జరిగిన పరిణామాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ సైతం రాజకీయ ప్రయెజనాలకోసం పనిచేస్తున్న

పెద్దల సభ అవసరమా అంటూ ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నింటితో మండలి రద్దుకు ప్రభుత్వం సిద్దమవుతోందన్న సంకేతాలిచ్చారు. అ మేరకు అవసరమైన పరిపాలన ప్రక్రియ

ప్రారంభించారు. క్యాబినెట్ భేటీ నిర్వహించి అందులో మంత్రి వర్గం మండలి రద్దుకు తీర్మానం చేయనున్నారు. అదే తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి సభ ఆమోదం

తీసుకుంటారు. వెంటనే కేంద్రానికి పంపి వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే చర్చకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. తద్వారా ప్రక్రియ వేగవంతంగా పూర్తి

చేయాలని సర్కారు భావిస్తోంది. 

మండలి లో బయలు దేరిన బిల్లు ఎక్కడుంది? . . .

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఇప్పుడెక్కడుంది..? సెలక్ట్ కమిటీకి

వెళ్లినట్టా.. వెళ్లనట్టా..? మొన్న మండలిలో జరిగిన పరిణామాల దగ్గర్నుంచి నేటి వరకూ ఛైర్మన్ షరీఫ్ మాటలు కన్ఫ్యూజన్ కు తెరతీస్తున్నాయి. దీంతో అసలు బిల్లు సెలక్ట్

కమిటీకి వెళ్లిందా.. లేదా అన్న చర్చ మొదలైంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ మండలిలో పెద్ద యుద్ధమే నడిచింది. బిల్లు ఎలాగైనా రిజెక్ట్ చేసేలా చేయాలని వైసీపీ,

సెలక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ ఎత్తులకు పైఎత్తులు వేశాయి. చివరకు నాటకీయ పరిణామాల తర్వాత తనకున్న విచక్షణాధికారాలు ఉపయోగించి ఛైర్మన్ షరీఫ్ బిల్లును

సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చెప్పారు. 

బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిందని ఫిక్సైన అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నాయి.

మీరు రూల్స్ ఉల్లంఘించారంటే.. మీరే అతిక్రమించారని మాటల తూటాలు పేల్చాయి. కానీ ఛైర్మన్ షరీఫ్ మాత్రం బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిందా.. లేదా అనేది క్లారిటీ

లేకుండా మాట్లాడుతున్నారు. పంపించానని ఓసారి.. మధ్యలో ఆగిందని మరోసారి అర్థం కాకుండా వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ పరస్పర విరుద్ధమైన మాటలతో అందరిలో అయోమయం నెలకొంది.

ఇంతకూ ఇప్పుడు వికేంద్రీకరణ బిల్లు ఎక్కడుంది అనే చర్చ జరుగుతుంది. రూల్ ప్రకారం సెలక్ట్ కమిటీని ఛైర్మన్ ఫామ్ చేయాలి. 

ఓ వైపు మండలి నిరవధికంగా వాయిదా

పడింది. ఇంకోవైపు మండలి రద్దు తీర్మానానికి వైసీపీ రెడీ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెలక్ట్ కమిటీ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఫామ్ అయినా బిల్లు ఆ కమిటీకి

వెళ్తుందా.. లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే టీడీపీ మాత్రం బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లిందని, విధివిధానాలకు సమయం పడుతుంది చెబుతోంది.

ప్రభుత్వం కూడా సెలక్ట్ కమిటీకి బిల్లు వెళ్లినట్టు హైకోర్టులో చెప్పిన సంగతి గుర్తుచేస్తోంది. దీంతో మండలి ఛైర్మన్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి.. సెలక్ట్ కమిటీ

విధివిధానాలపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam