DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలోచింప చేసిన దిశా చట్ట అవగాహనా ప్రదర్శన   

ఓటరు దినోత్సవం లో విద్యార్థినుల ప్రదర్శనలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  25, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖ  à°œà°¿à°²à±à°²à°¾ యంత్రాంగం

జాతీయ ఓటర్ దినోత్సవం వేడుకలను విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ చిల్డ్రన్ ఎరీనా లో శనివారం నిర్వహించిన అవగాహనా సదస్సులో విద్యార్థినుల ప్రదర్శనలు

అందరిని ఆలోచింప చేసాయి.  
ఈ సందర్బంగా సెయింట్ జోసెఫ్ కళాశాలకు చెందిన విద్యార్థినులు దిశా చట్టం గురించిన సందేశాన్ని వివరించే విధంగా ప్రదర్శించిన రెండు

నిమిషాల స్కిట్ ప్రదర్శన ఆహుతులను à°•à°‚à°Ÿ తడి పెట్టించింది.     
 
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివిఎంసి ) పరిధిలో మధురానగర్ పాఠశాల లో 9 వ తరగతి

చదువుతున్న ప్రణతి ఓటర్ నమోదు ప్రక్రియ ఆవశ్యకత, బాధ్యతలను ఆంగ్లంలో వివరించింది. నగరం లోని వివిధ పాఠశాలల విద్యార్థులు దేశ భక్తి గీతాలను ఆలపించగా మరికొందరు

దేశ భక్తి గీతాలకు నృత్య ప్రదర్శన చేసారు.  

ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వి. వినయచంద్, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉపకులపతి ( ఇంచార్జి) డాక్టర్ పివిజిడి ప్రసాద్

రెడ్డి,  à°¸à°‚యుక్త కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, విద్యాశాఖాధికారి లింగేశ్వర రెడ్డి, ఇతర అధికారులు, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు

పాల్గొన్నారు. 

అంతకు ముందు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివిఎంసి) కార్యాలయం నుంచి చిల్డ్రన్ ఆరిన వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ

ర్యాలీని జిల్లా సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభిచారు. à°ˆ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam