DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రోజు వారి ప్రగతి నివేదికలను సమర్పించాలి :కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  25, 2020 (డిఎన్‌ఎస్‌) : రోజు వారి ప్రగతి నివేదికలను సమర్పించాలని శ్రీకాకుళం జిల్లా

కలెక్టర్ జె. నివాస్ ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల కల్వర్జెన్సీ

సమావేశమును నిర్వహించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయితీ రాజ్, మరియు ఆర్. డబ్యూ. ఎస్ ఇంజనీరింగ్  à°¶à°¾à°–లు ద్వారా చేపడుతున్న సిసి రోడ్లు, సిమ్మెంటు కాలువలు

నిర్మాణం, గ్రామ సచివాలయం భవనాలు నిర్మాణం, పాఠశాల భవనాలకు ప్రహరీగోడలు నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో

ఇప్పటివరకు 1060 కిలో మీటర్లు సిసిరోడ్లను నిర్మించడం జరిగిందని తెలిపారు. గతంతో పోల్చిచూస్తే ప్రగతి చాలా తక్కువగా ఉందని అన్నారు. ప్రతీ మండలంలో రోజుకు 250 మీటర్లు

సిసి రోడ్డు నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. ఆవిధంగా అయితే ఒక మండలంలో నెలకు 7.5 కిలోమీటర్లు రోడ్డు నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ప్రతిరోజు ఒక

గ్రామములో 25 మీటర్లు సిమ్మెంటు కాలువ నిర్మాణం పనులు జరగాలని చెప్పారు. రోజుకు 6 గ్రామాలను ఎంపిక చేసుకొని మండలంలో 150 మీటర్లు కాలువ నిర్మాణం జరగాలని ఆదేశించారు.

మండలాలకు మంజూరు చేసిన గ్రామ సచివాలయం భవనాల పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మండలాల వారిగా సమీక్షించారు. కొత్తూరు మండలానికి మంజూరు కాబడిన గ్రామ

సచివాలయం భవనాలు పనులు ప్రగతి బాగుందన్నారు. మిగతావారు కూడా వీటిపై దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, సిసి రోడ్లు, సిసి కాలువలు నిర్మాణం పనుల

ప్రోగ్రస్ ప్రతీరోజా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
    à°ˆ సమావేశంలో డ్వామా పి.à°¡à°¿. కూర్మారావు, ఆర్. డబ్ల్యూ. ఎస్.à°‡.  à°Žà°¸à±. రామ్మోహన్, పంచాయితీ రాజ్ ఎస్.à°‡. à°Ÿà°¿.

శ్రీనివాసరావు, డి.ఇలు, ఎ.ఇలు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam