DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సోమవారం నుంచి పాత్రికేయులకు డ్రైవింగ్ లైసెన్సు మేళా 

విశాఖపట్నం, జూన్ 23, 2018 (DNS Online) :  à°µà±ˆà°œà°¾à°—్ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యవం లో మూడు రోజుల పాటు డ్రైవింగ్ లైసెన్సు మేళా నిర్వహిస్తున్నట్టు విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీను

బాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావులు తెలిపారు. శనివారం విజెఎఫ్ ప్రస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ

మేళా కొనసాగుతుందని, గ్రేటర్ విశాఖపట్నం పరిధి లోని వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్  సభ్యులు, వారి కుటుంబ సభ్యులు à°ˆ మేళా లో పాల్గొని టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల లైసెన్సు

పొందవచ్చన్నారు. సోమవారం ఉదయం 9:30 à°—à°‚à°Ÿà°² నుంచి  à°ˆ ప్రక్రియ మొదలవుతుందని, దీనికి హాజరయ్యే వారు తమ వెంట ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, పుట్టిన తేదీ ధ్రువీకరణ (

పదవ తరగతి మార్కుల జాబితా) ఇతర ధ్రువీకరణ పత్రాలు  à°¤à°ªà±à°ªà°¨à°¿ సరిగా తీసుకురావాలన్నారు. టూ వీలర్ కు రూ. 260 లు రిజిస్ట్రేషన్ సమయం లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు దారుడు

చెల్లించాలన్నారు. టూ వీలర్, ఫోర్ వీలర్ కు కలిపి రూ. 413 చెల్లించాలని తెలిపారు. మంగళవారం మిలీనియం సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ , ద్వారకానగర్ కార్యాలయం లో ఆర్టీఓ

అధికారులు నిర్వహించే పరీక్ష ఉంటుందన్నారు. ఇందుకోసం దరఖాస్తుదారులు ముందుగానే ఆర్టీ ఓ పరీక్షా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని అరగంట పరిశీలించినట్టయితే

పరీక్షలో సులభంగా పస కావచ్చన్నారు. సోమవారం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే మంగళ, బుధ వారాల్లో, అవసరమైన పరీక్షలు నిర్వహించి ఎల్ ఎల్ ఆర్ , ఇతర

ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారన్నారు. ఇప్పడికే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ మేళా లు నిర్వచించామన్నారు. ఈ విలేకరుల సమావేశం లో వి జె ఎఫ్ ఉపాధ్యక్షులు

ఆర్. జగరాజు పట్నాయక్, నానాజీ, దాడి రవికుమార్, మూర్తి, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam