DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ సౌభాగ్యం దిశగానే విద్యాధ్యయనం ఉండాలి : చిన్న జీయర్ 

వేదాధ్యయన ఆశ్రమాల్లోనూ వైభవంగా గణతంత్ర వేడుకలు 

దేశం వేరు - హైందవ ధర్మం వేరు కాదు - రెండు అంతర్భాగమే   

శంషాబాద్ లో చిన్న జీయర్ స్వామి,  à°¸à±€à°¤à°¾à°¨à°—à°°à°‚

లో అహోబిల జీయర్ స్వామి

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . 

హైదరాబాద్ / విశాఖపట్నం, జనవరి  26, 2020 (డిఎన్‌ఎస్‌) : భారత దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ

వ్యాప్తంగా వేదాధ్యయన ఆశ్రమాల్లోనూ వైభవంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన గణతంత్ర వేడుకలు హైదరాబాద్ లోని జీవా ( జీయర్ వేదాధ్యయన కేంద్రం ) కేంద్రంలో ప్రముఖ

ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యవంలోనూ, గుంటూరు జిల్లా సీతానగరం లోని జీయర్ స్వామి ఆశ్రమం లో వీరి శిష్యులు అహోబిల రామానుజ జీయర్ స్వామి

నేతృత్వంలోనూ జరిగాయి. భారత దేశ జాతీయ జండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేసారు. అదే ప్రాంగణం లో భారత మాత చిత్ర పటానికి వందనం సమర్పించారు. à°ˆ సందర్బంగా చిన్న జీయర్

స్వామి మాట్లాడుతూ తమ ఆచార్యులు పెద్ద జీయర్ స్వామి పూర్వాశ్రమం లో భారత దేశ స్వాతంత్ర పోరాటం లో పాల్గొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఈ దేశ అభ్యుదయం కోసం

సన్యాసం స్వీకరించి భారత దేశం మొత్తం సంచరించి, ప్రజల్లో ఉత్తేజాన్ని కల్గించారన్నారు. ఆయన అందించిన సందేశమే దేశ సౌభాగ్యం దిశగానే విద్యాధ్యయనం ఉండాలన్నారు.

తమ సంస్థ అధీనంలో నడుస్తున్న వేద పాఠశాల విద్యాలయ విద్యార్థులు, నేత్ర విద్యాలయ విద్యార్థిని విద్యార్లులు, జీవా సూపర్ స్పెషలిటీస్ ఆసుపత్రి వైద్య బృందాన్ని

ఉద్దేశించి తమ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో విజేతలు గా నిలిచిన వారికి బహుమతి ప్రదానం చేసారు. తమ జీవ ఆసుపత్రిలో

అనిర్వచనీయ వైద్య సేవలు అందిస్తున్న ముస్లిం వైద్యునికి ప్రతిభా పురస్కారం అందించారు. 

సీతానగరం లో . . .

గుంటూరు జిల్లా సీతానగరం లోని జీయర్ స్వామి

ఆశ్రమం లోని విజయకీలాద్రి ఆలయ ప్రాంగణం లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చిన్న జీయర్ స్వామి శిష్యులు అహోబిల రామానుజ జీయర్ స్వామి నేతృత్వంలోనూ జరిగాయి. ఈ

సందర్బంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ విద్యార్థులకు వేద ప్రాముఖ్యతతో పాటు, దేశ గౌరవం, వైభవాన్ని పెంపొందించవలసిన భాద్యత ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన భారీ

జాతీయ ( ప్రమాణం ప్రకారమే) జండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేసారు.  à°µà±‡à°¦ విద్యార్థులు అందరూ చిన్న జాతీయ జండాలను చేత పట్టి, వేద పారాయణ తో పాటు, జాతీయ గీతాన్ని కూడా

ఆలపించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam