DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ ఆమోదం 

రద్దు ను కోరుతూ ఓటింగ్ లో 133 à°¸à°®à±à°®à°¤à°‚. .. 

పదవులు కోల్పోనున్న  à°®à°‚త్రులు మోపిదేవి, పిల్లి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . . .

అమరావతి,

జనవరి  27, 2020 (డిఎన్‌ఎస్‌) : శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఆమోదం వేసింది. సోమవారం జరిగిన సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని

ఓటింగ్ సమయంలో సభకు హాజరైన 133 à°®à°‚ది సభ్యులు తమ ఆమోదాన్ని తెలిపారు. దీంతో సభాపతి తమ్మినేని శాసన మండలి ని రద్దు చేస్తూ సభ ఆమోదించినట్టు ప్రకటించారు.  à°¶à°¾à°¸à°¨ మండలి

రద్దు తో ప్రస్తుతం మంత్రులు గా ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు తమ పదవులకు త్యాగం చెయ్యవలసి వచ్చింది. వీరిద్దరూ శాసన మండలి లో సభ్యులుగా

కొనసాగుతున్నారు. మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం, పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజవర్గం కు

చెందినవారు. 

అంతకు ముందు ఈ నిర్ణయం పై రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పాలన

వికేంద్రీకరణ, సీఆర్​డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపటంతో ఆగ్రహం చెందిన వైకాపా సర్కారు శాసనమండలిని రద్దు చేసేందుకే మొగ్గుచూపింది.

మండలిలో మెజారిటీ లేకపోవటంతో శాసనసభలో ఆమోదించిన బిల్లులు మండలిలో ఆమోదం పొందలేకపోతున్నాయి. బిల్లులు తిప్పి పంపడం, జాప్యం చేయడం ప్రభుత్వానికి మింగుడు పడటం

లేదు. ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేశారు. పార్టీలో ముఖ్యనేతలు, న్యాయ నిపుణులతోనూ చర్చించిన జగన్  à°®à°‚డలిపై వేటు

వేయాలని నిర్ణయించుకున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటివరకు మండలి రద్దు చేస్తామని అధికారికంగా చెప్పకపోయినా రద్దుకే సీఎం మొగ్గు

చూపుతున్నట్లు వైకాపా నేతలు స్పష్టం చేశారు. పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు స్పష్టం చేసినా సీఎం రద్దుకే నిశ్చయించినట్లు చెబుతున్నారు. తాజాగా మంత్రి

మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మండలి రద్దుకు కేబినెట్ లో ఆమోదం తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam