DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉద్యమాల నేపథ్యంలో సిఐటియు ది కీలకపాత్ర :తపన్ సేన్  

విశాఖ లో బీమా సంస్థల ఉద్యోగుల సంఘం జాతీయ సదస్సు 

ఎల్ ఐ సి నియామకాలకు సి ఏ బి ఎఫెక్ట్: వేణుగోపాల్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

.

విశాఖపట్నం, జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌): ఉద్యమాల నేపథ్యంలో సిఐటియు కీలకపాత్ర పోషిస్తోందని మాజీ ఎంపీ సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్  తెలిపారు

విశాఖపట్నంలోని సాగర తీరం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కన్వెన్షన్ ప్రాంగణం లో జరుగుతున్న ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ సంఘం 25 వ వార్షికోత్సవ వేడుకల్లో

ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోరాటాలకు నిలయం ఆలవాలం సిఐటియు అన్నారు ప్రస్తుతం రంగస్థలం ఉద్యమ పోరాటం అత్యున్నత స్థాయిలో

ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు బీమా రంగ సంస్థలు అన్నారు బీమా రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న

షెడ్యూల్ చర్యలు ప్రజామోదం కాదు అన్నారు ఈ కార్యక్రమంలో ఇంతవరకు బీమా రంగ సంస్థల ప్రస్థానం ఇక జరగబోయే కార్యాచరణ ఆయన ప్రకటించారు.

ఎల్ ఐ సి నియామకాలకు సి ఏ

బి ఎఫెక్ట్: వేణుగోపాల్ 

ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయి సంఘం ఉపాధ్యక్షులు వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పౌరసత్వ సవరణ

చట్టం నిబంధనల కారణంగా ఎల్ఐసి నియామకాల్లో అంతరాయం  à°•à°²à°¿à°—ిందన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఎల్ఐసి సంస్థల్లో జరుగుతున్న నియామకాల్లో భారీ ఎత్తున భర్తీ

కావాల్సి ఉండగా పౌరసత్వ సవరణ చట్టం అందుబాటులోకి రావడంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పడిపోయాయని, కేవలం ఒక అభ్యర్థి మాత్రమే దరఖాస్తు

చేసుకోగలిగారన్నారు. దీనికి కారణం స్థానిక స్థానికత అంశం ప్రతిబంధకంగా ఉందన్నారు. తాము గత 40 సంవత్సరాలుగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సేవలు

అందిస్తున్నామన్నారు. ఇంతకాలం ఏర్పడని అవాంతరాలు నేడు సంస్థ నియామకాల్లో చోటు చేసుకుందన్నారు. తాము భారతీయ పౌరులమేనని తమకు భారతీయ చట్టాలు అమలు అవుతాయని

కాశ్మీర్ ప్రాంతం సభ్యులు ఈ సమావేశాల్లో తెలియజేసినట్లు వివరించారు. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు మూడు వేల

మంది బీమా రంగ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నట్టు ఆయన తెలిపారు ఈ మీడియా సమావేశంలో కె వి ఎం రాజు ఎస్ కె బి.ఎన్ రాజు, జాతీయ సదస్సు మీడియా వ్యవహారాల ప్రతినిధి రామకృష్ణ

తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam