DNS Media | Latest News, Breaking News And Update In Telugu

30 న చలో పిఠాపురం - పరిపూర్ణానంద ధర్మాగ్రహ నిరసన

హిందూ విగ్రహాల ధ్వంసం పై పరిపూర్ణానంద ధర్మాగ్రహం 

చలో పిఠాపురం కు పెరుగుతున్న హిందూ సమాజం బలం  

పోలీసులారా ఆత్మసాక్షిగా పని చెయ్యండి,

ప్రభుత్వం దిగి రావలసిందే . . . .

23 విగ్రహాలు కూలిస్తే మీడియా కళ్ళు మూసుకుందా: పరిపూర్ణానంద 

స్వామి నేతృత్వం లో దుశ్చర్యలపై నిగ్గు తేల్చాల్సిందే. . .

సైకో పేరు చెప్పి కేసు మూసేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి: స్వామి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . . 

విశాఖపట్నం, జనవరి  29, 2020 (డిఎన్‌ఎస్‌):

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో 23 విగ్రహాలను రాత్రికి రాత్రి కూల్చేస్తే చర్యలు చేపట్టవలసిన పోలీసు యంత్రాంగం ఒక వర్గానికే అనుకూలంగా పని చేస్తోందని,

దీనికి నిరసనగా జనవరి 30 న హిందూ ధర్మాగ్రహ నిరసన చేపడుతున్నట్టు శ్రీ పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద ప్రకటించారు. గురువారం తాము చేపడుతున్న హిందూ ధర్మాగ్రహ

నిరసన దీక్ష కార్యాచరణను ఆయన à°’à°• ఛానెల్ లో వివరించారు. à°ˆ సందర్బంగా à°’à°• గల్లీ స్థాయి రాజకీయ నేత à°•à°¿ చెందిన పోస్టర్ ను చింపితేనే 
దేశంలోని టీవీ చానెళ్లు అన్నీ

రోజుల తరబడి గగ్గోలు పెట్టేసుంటాయని, అలాంటిది 23 హిందూ దేవీ విగ్రహాలను కూల్చేస్తే  à°®à±€à°¡à°¿à°¯à°¾ వర్గాలు కళ్ళు మూసుకు పోయాయా అని ప్రశ్నించారు. కోట్లాది మంది

హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా జరిగిన à°ˆ ఘటన చాలా పెద్ద నేరమని, దీని సంగతి పూర్తిగా తేల్చేవరకూ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. 

హిందూ ధర్మం

అంటే పండగలకు ప్రకటనలు ఇచ్చేదేనా: . . .

హిందూ ధర్మం అంటే టీవీ ఛానెళ్ల కు కేవలం పండగలకు ప్రకటనలు ఇచ్చే ఆర్థిక యంత్రంగా భావిస్తున్నట్టు ఉన్నాయని స్వామిజి

ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. కనీస భాద్యత కూడా లేకుండా సమాజంలో కొందరు వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు. పిఠాపురం పట్టణం లో జరిగిన దుర్ఘటన పై కనీసం ప్రసార సాధన

మాధ్యమాల్లో ఎటువంటి వార్తలు కూడా రాకపోవడం అత్యంత బాధాకరమన్నారు. దీనిపై పోరాటం చేసేందుకు తాము ఎంతదూరమైనా వెళ్తామన్నారు. 

గురువారం ( జనవరి 30 న) పిఠాపురం

పట్టణంలో ముష్కరులు ధ్వంసం చేసిన దేవీ దేవతా విగ్రహాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. అనంతరం అక్కడే నిరసన వేదిక వద్ద భారీ సంఖ్యలో హిందువులతో కలిసి శాంతియుత

నిరసనలు చేస్తామన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి దోషులపై కఠిన చర్యలు తీసుకునే వరకూ తమ ఉద్యమం ఆగదన్నారు. అవసరమైతే నిరాహార దీక్ష కు సైతం దిగుతామని

హెచ్చరించారు. ఈ దేశం లో హిందువులకు కనీసం జీవించే హక్కు కూడా లేకుండా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేవలం కొందరికే తొత్తులు గా

పనిచేస్తున్న వారిపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ముష్కరుడు సైకో యా? కేసు ప్రక్కదారి పట్టించొద్దు : . . . 

23 హిందూ దేవీ దేవతా

విగ్రహాలను కూల్చిన దోషుల్లో ఒకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే. . . ఆతను ఒక మానసిక రోగి ( సైకో ) అని కేసు ను పూర్తిగా ప్రక్కదారి పట్టించే

ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వామి మండిపడ్డారు. సైకో అయితే కేవలం హిందూ విగ్రహాలనే కూల్చడం ఏంటని, ప్రక్కనే ఉన్న చర్చి గానీ, ఇతర గృహవాసాలు గానీ అతనికి

కనపడలేదా అని ప్రశ్నించారు. సైకో అయితే కేసు వదిలేస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి సైకో యే ముగ్గురిని హత్య చేసిన నేరంలో ఉరి శిక్ష విధించాలని తెలుగు రాష్ట్రాలు

గగ్గోలు పెడుతున్న విషయాన్ని గుర్తు చేసారు. సైకో అయితే ఏదైనా చెయ్యొచ్చా అని ప్రశ్నించారు.  à°¸à±ˆà°•à±‹à°—à°¾ చిత్రీకరించిన వాళ్ళు, అతను యే మెంటల్ ఆసుపత్రిలో జాయిన్

చేసారో చెప్పాలన్నారు. హిందూ మనోభావాలతో ఆటలాడే ప్రయత్నం చేయవద్దన్నారు. 

గతంలో ప్రభుత్వం, నేడు ప్రభుత్వ అభిమానులా? : ..  .

గత ప్రభుత్వ హయాంలో కృష్ణ

పుష్కరాల పేరు చెప్పి విజయవాడ నగరం లో ఏకంగా 40 కి పైగా హిందూ ఆలయాలను ప్రభుత్వమే కూల్చి వేసిందన్నారు. దానికి ప్రతిఫలంగా ఆ పార్టీ నేడు కనీసం బట్టకట్టే పరిస్థి

లేకుండా ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారన్నారు. అయితే నేడు జరిగిన ఘటన ప్రభుత్వం లో ఉన్న పార్టీ అభిమానులుగా తేలిందన్నారు. ఈ ఘటన పై కఠిన చర్యలు తీసుకోకుంటే ఈ

పార్టీ ని హిందూ సమాజం ఛీత్కరించుకునే పరిస్థితి నెలకొంటుందన్నారు.   

ఈ నిరసన కార్యక్రమం లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులు అందరూ పిఠాపురం

రావాల్సిందిగా పిలుపునిచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam