DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ సపక్ తక్రాలో గోల్డ్ మెడల్ విజేతకు అభినందనలు 

శ్రీకాకుళం కు చెందిన ప్రేమ కు అభినందన వెల్లువ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం). : . .  .

శ్రీకాకుళం, జనవరి  30, 2020 (డిఎన్‌ఎస్‌) :

 à°œà°¾à°¤à±€à°¯à°¸à±à°¥à°¾à°¯à°¿à°²à±‹ జరిగిన సపక్ తక్రా క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన శ్రీకాకుళం కు చెందిన సురవరపు ప్రేమను పాఠశాల ఉపాధ్యాయ బృందం తల్లితండ్రుల కమిటీ

సమక్షంలో అభినందించింది. ఈ మేరకు గురువారం ఉదయం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యం. వాగ్దేవి పాత్రికేయుల సమావేశాన్ని

నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సురవరపు ప్రేమ తమ పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్

ఆధ్వర్యంలో జరిగిన పలు పోటీల్లో క్రీడప్రతిభను కనబరిచి జిల్లా, రాష్ట్రస్థాయిలో అనేక మెడల్స్ ను సాధించినట్లు  à°†à°®à±† వివరించారు. ప్రేమ అథ్లెటిక్ రన్నర్ à°—à°¾ ప్రతీ

రోజు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ప్రాక్టీస్ చేసేదని, ఈమె లోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్ అర్జునరావు రెడ్డి సపక్ తక్ర క్రీడలో తర్ఫీదు

ఇచ్చారని చెప్పారు. à°ˆ నెల 11 నుండి 24 వరకు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో   జరిగిన  à°œà°¾à°¤à±€à°¯à°¸à±à°¥à°¾à°¯à°¿ సపక్ తక్ర పోటీల్లో తమ విద్యార్ధి అయిన ప్రేమ పాల్గొనడమే కాకుండా

శ్రీకాకుళం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారిణిగా జాతీయస్థాయిలో బంగారు పతకాన్ని సాధించిందడం జరిగిందని ఆమె వివరించారు. సపక్ తక్ర క్రీడల్లో

జాతీయస్థాయిలో క్రీడప్రతిభను కనబరచి జిల్లాకు బంగారు పతకాన్ని సాధించిన ప్రేమను జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్.పి ఆర్.ఎన్. అమ్మిరెడ్డి తదితరులు గణతంత్ర

దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకంగా అభినందించి,ప్రశంసా పత్రాన్ని అందజేశారని గుర్తుచేసారు. విద్యార్థిని క్రీడలకు ప్రోత్సహించిన ప్రేమ తల్లితండ్రులయిన

సూర్యనారాయణ, పద్మలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  à°…భినందించి, తమ వంతు సాయంగా రూ.5000/-లు నగదును విద్యార్థినికి అందజేశారు. ఇదేస్పూర్తితో భవిష్యత్తులో మరెన్నో

జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఇంతటి ఘనమైన విజయాన్ని సాధించిన ప్రేమ తమ పాఠశాల విద్యార్ధి అయినందుకు గర్వకారణంగా ఉందన్నారు.
à°ˆ

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె.కృష్ణ కుమారి, భారతి, కుమారి, అభిమన్యు, సాయి ప్రశాంతి , విద్యార్థులు , తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam