DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుష్టు వ్యాధిపై అవగాహన పెంపొందించుకోవాలి – మంత్రి కృష్ణదాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  30, 2020 (డిఎన్‌ఎస్‌) : కుష్ఠు వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పిలుపునిచ్చారు.   శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురు వారం

కుష్ఠు వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమం –“ స్పర్శ”  à°œà°°à°¿à°—ింది. à°ˆ కార్యక్రమానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన సమాజం నెలకొనాలని ఆయన పేర్కొన్నారు. విద్యా,వ్యవసాయం, వైద్యానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రజలకు

చేరువగా పాలన సాగిస్తూ పారదర్శక వ్యవస్ధను నెలకొల్పుతున్నారని చెప్పారు. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థతో పరిపాలన కట్టు దిట్టం చేయడమే కాకుండా ప్రజలవద్దకు పాలన

చేర్చారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖ, సంతోషాలతో ఉండాలని ముఖ్య మంత్రి కోరుకుంటున్నారని చెప్పారు. అమ్మ ఒడి, రైతు భరోసా వంటి కార్యక్రమాలతో రైతులు,

తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి వారికి ఆర్ధికంగా భరోసాను చేకూర్చుతున్నారని పేర్కొన్నారు. వెయ్యి రూపాయలు దాటిన చికిత్సలను ఆరోగ్య శ్రీ లో చేర్చారని

తెలిపారు. బాపూజీ కుష్టు వ్యాధిగ్రస్తులకు ఎంతో సేవలు  à°šà±‡à°¶à°¾à°°à°¨à°¿ పేర్కొంటూ కుష్ఠు వ్యాధిగ్రస్తుల పట్ల సమాజం గౌరవ భావం కలిగి ఉండాలని, చిన్నచూపు చూడరాదని

పిలుపునిచ్చారు. కుష్ఠువ్యాధి అంటువ్యాధి కాదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పడం ద్వారా వ్యాధి భారీన పడకుండా ఉండవచ్చని

చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తుందని అందులో భాగంగా రూ.5 వేలు పింఛను ఫిబ్రవరి 1 నుండి అందిస్తుందని చెప్పారు.

కుష్ఠువ్యాధిగ్రస్తులకు వ్యాధి పూర్తిగా నయం అయ్యే వరకు మందులు అందించి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలంలో అధికంగా మత్స్యకారులు

ఉన్నారని, ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. ఉగాది నాడు రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పరిపాలనా

వికేంద్రీకరణతో అభివృద్ధి చెందుతుందని మంత్రి స్పష్టం చేసారు.

          ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి పట్ల అవగాహన

పెంచు కోవాలన్నారు. ముద్దాడలో వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని కోరారు.

జాయింట్

కలెక్టర్-2 రెడ్డి గున్నయ్య మాట్లాడుతూ కుష్టు అవగాహన కార్యక్రమాలు పక్షం రోజుల పాటు జరుగుతాయన్నారు. చికిత్స ద్వారా వ్యాధి పూర్తిగా నయం అవుతుందని చెప్పారు.

కష్ఠువ్యాధి అంటువ్యాధి కాదని పేర్కొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎం.చెంచయ్య మాట్లాడుతూ కుష్టు వ్యాధిపై అవగాహన ముఖ్యం అన్నారు. మైక్రో

బ్యాక్టీరియం లెప్రె అనే బాక్టీరియా వలన కుష్టువ్యాధి సంక్రమిస్తుందన్నారు. స్పర్శలేని మచ్చ రూపంలో చర్మానికి తద్వారా నరాలకు సోకుతుందని చెప్పారు.

కుష్ఠువ్యాధి ఎవరికైనా రావచ్చని, వంశపారంపర్యం కాదని అన్నారు. కుష్ఠువ్యాధికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, 6 నుండి 12 నెలల్లో పూర్తిగా నయం అవుతుందని

వివరించారు. వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తంచి యం.డి.టి చికిత్స అందిస్తే అంగవైకల్యానికి దారితీయదని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం ఫిబ్రవరి 15 నుండి మూడవ దశ

ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

రోటరీ క్లబ్ సభ్యులు, సామాజిక కార్యకర్త మంత్రి వెంకట స్వామి కుష్టువ్యాధి పై అవగాహన కల్పించారు. ముద్దాడ మండల పరిషత్

ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మణిపాత్రుని నాగేశ్వరరావు రచన, దర్శకత్వంలో ఆ పాఠశాల విద్యార్థులు కుష్ఠువ్యాధిపై లఘు నాటికను ప్రదర్శించి చక్కటి అవగాహన

కలిగించారు. లఘు నాటిక ప్రదర్శనపట్ల మంత్రి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ సచివాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా

కుష్ఠు నివారణ అధికారి డా లీలా, సమగ్ర శిక్షా అభియాన్ పిఓ పివి రమణ, బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ఎం. ప్రసాద రావు., స్ధానికులు ముద్దాడ శంకర రావు, బెండి రామారావు,

వైద్య అధికారులు, మండల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam