DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి ఆలయానికి పోటెత్తిన రాజకీయ జనం 

అరసవల్లి లో ఆదిత్యునికి అమాత్యుల ఆరాధనలు 

సూర్య దేవాలయం లో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలే అధికం 

యధావిధిగా సామాన్య భక్తులకు చుక్కలు

చూపారు. 

భక్తుల నుంచి విఐపిలకు ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాట్లు 

అరసవల్లి లో భారీ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్

రిపోర్టర్, శ్రీకాకుళం) : . . .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 01, 2020 (డిఎన్‌ఎస్‌) : రధసప్తమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థిరవారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ

సూర్యనారాయణ స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో రాజకీయ పార్టీల నేతలు పోటెత్తివచ్చారు. మాఘ శుద్ధ సప్తమి - సూర్య భగవానుని జన్మ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని

రధసప్తమి గా దేశ వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్బంగా ఫిబ్రవరి 1 న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవస్థానం లో భారీ ఏర్పాట్లు

చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఏర్పాట్లన్నీ సామాన్య భక్తుల నుంచి అధికార పార్టీ నేతలకు, ఇతర వీఐపీ లకు ఇబ్బంది, అవాంతరాలు తలెత్తకుండానే

జరిగినట్టు సుస్పష్ఠంగా దర్శనమిచ్చింది. తెల్లవారుఝామునే శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ ( దేవాదాయ శాఖ మంత్రి), ధర్మాన

కృష్ణదాస్( రహదారులు భవనాలు శాఖా మంత్రి), ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు సహా భారీ సంఖ్యలో

అధికార పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతలు ప్రముఖులు హాజరయ్యారు.  

జిల్లా కలెక్టర్ జె. నివాస్, జిల్లా కు చెందిన ఇతర ఉన్నతాధికారులు

ఆదిత్యుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. 

యధావిధిగా సామాన్యులకు

చుక్కలే. . . :

రాష్ట్ర దేవాదాయ శాఖా ఆధ్వర్యవం లో నిర్వహించబడుతున్న ఆలయం కావడంతో సామాన్య భక్తులకు యధావిధిగా చుక్కలు కనపడ్డాయి. సామాన్య భక్తులు శుక్రవారం

రాత్రి సమయానికే ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే గ్రామం చిన్నది కావడం తో చలిలో పిల్లలు, వృద్ధులతో నానా అవస్థలు పడ్డారు. 

విఐపిలు, రాజకీయ నేతల

వాహనాలను నేరుగా ఆలయ ప్రాంగణానికి సమీపం వరకూ చేరుకునే అవకాశం కల్పించిన అధికారులు, సామాన్యుల వాహనాలను మాత్రం అల్లంత దూరంలోనే నిలిపివేయడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam