DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాడు జన్మభూమి - నేడు గ్రామ వాలంటీర్లు అవే తప్పులు 

సంక్షేమ పథకాల్లో కోతలుపెడుతున్నారు 

పలు  à°•à°¾à°°à±à°ªà±Šà°°à±‡à°·à°¨à±à°² నిధులు దారి మళ్లిస్తున్నారు 

సి.ఏ.ఏ., ఎన్నార్సీలపై అపోహలు

సృష్టిస్తున్నారు 

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి 

నరసారావుపేట కార్యకర్తల మీట్ లో జనసేనాని పవన్  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం) : . . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 01, 2020 (డిఎన్‌ఎస్‌) : గతం లో తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన తప్పులని నేడు గ్రామా వాలంటీర్లు కూడా చేస్తున్నారని

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. శనివారం గుంటూరు జిల్లా నర్సారావు పేట లో జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఈ

సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు వందలాది ఆంక్షలు పెట్టి నిజమైన లబ్ధిదారులను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు.  à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ హయాంలో

జన్మభూమి కమిటీలు ఎంత అరాచకం సృష్టించాయో.. వైసీపీ హయాంలో గ్రామ వాలంటీర్లు కూడా అదే తప్పులు పునరావృతం చేస్తున్నారని మండిపడ్డారు. పొలం లేనివాడికి ఉందని,

ఉమ్మడి కుటుంబంలో ఉన్నవాడికి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని సాకుగా చూపించి సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పేరు

రావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం విఫలమవుతుందని హెచ్చరించారు. 

రాష్ట్ర ఆర్ధికవ్యవస్థ చిన్నాభిన్నంగా తయారైంది. సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడ

నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. ఎస్సీ, ఎస్టీ, కాపు, బీసీ, మైనార్టీ వర్గాలను బలోపేతం చేయడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ల నుంచి నిధులను పథకాల కోసం

దారి మళ్లిస్తున్నారు. దీంతో కార్పొరేషన్ నుంచి రుణాలు, సాయం పొందాలనుకున్న వ్యక్తులకు న్యాయం జరగకా.. ఇటు సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు సక్రమంగా అందకా

ఎవరికి న్యాయం జరగడం లేదు. రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న చాలా పథకాలకు కేంద్రం నుంచి 70 శాతం నిధులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలకు ఎంత వరకు

కేంద్రం నుంచి నిధులు అందుతున్నాయో తర్వలోనే ప్రజలకు తెలియజేస్తాం. అదే విధంగా ఏ విధంగా నిధులను దారి మళ్లిస్తున్నారో ప్రజలకు వివరిస్తాం అన్నారు.  

కల్తీ

పాల మాఫియా వెనక ఎవరున్నారు ?: . .. 

పసి పిల్లలకు పౌష్టికాహారమైన పాలను కల్తీ చేయడం బాధాకరం. యూరియాలాంటి రసాయనిక ఎరువులను కలిపి పాలను తయారు చేసి

అమ్ముతున్నారంటే పరిస్థితి ఎంతవరకు దిగజారిందో తెలుస్తోంది. ఇలాంటి పాలతో పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కల్తీ పాల మాఫియా వెనక స్థానిక

వైసీపీ ఎమ్మెల్యే హస్తం ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఎవరూ ప్రశ్నించరు.  à°¨à±‡à°¨à± చేయగలిగింది ఏంటంటే ఇలాంటి వాటిపై యువకులు పోరాటం చేసే ధైర్యం ఇవ్వగలను.

సోషల్ మీడియాలో మనపై జరుగుతున్న దాడిని జనసైనికులు బలంగా ఎదుర్కోవాలి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీ-టీం అని వైసీపీ ప్రచారం చేసింది. దానిని

బలంగా తిప్పికొట్టలేకపోయాం. వాళ్లు చేసే ట్రోలింగ్ కు మనం లొంగిపోతే జనసేన కోటలోకి శత్రువు రావడానికి అవకాశం ఇచ్చినట్లే. రాజకీయాల్లోకి నేను డబ్బు

సంపాదించడం కోసం రాలేదు. సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన, ఆవేదనతో వచ్చాను. దీనిని జనసైనికులు దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో ప్రత్యర్ధుల చేస్తున్న దాడులను

తిప్పికొట్టాలి.  

రాజకీయాలంటే జాతీయ సేవ : . . . .

ఎమ్మెల్యే, రాజకీయనాయకుడిగా ఉండటం కంటే పార్టీ అధ్యక్షుడిగా ఉండటం చాలా కష్టం. పార్టీని నడపాలంటే కత్తి

మీద సాము లాంటింది. పార్టీకి ఆర్ధికపుష్టి ఇవ్వడానికి మన దగ్గర పాల ఫ్యాక్టరీలు, సిమెంటు ఫ్యాక్టరీలు లేవు. ఇన్ సైడ్ ట్రేడింగ్ లు వంటివి మనకి చేతకాదు. మనకు

చేతనైనది సినిమాలు చేయడం మాత్రమే. ఎమ్మెల్యేగా గెలిచి అధికారానికి ఎంతోకొంత దగ్గరగా ఉంటే సినిమాలు చేసే సమయం ఉండేది కాదు. కానీ అధికారంలో లేము, పార్టీని

నడపాలంటే డబ్బు అవసరం. సినిమాల్లో సంపాదించిన డబ్బుతో పార్టీని నడపాలి. ట్రంప్ లాంటి బిలినియర్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికల సమయంలో డొనేషన్లు తీసుకుంటారు. మన దగ్గర

అలాంటి పరిస్థితి లేదు. అందుకే మనం స్వశక్తితో పని చేసి వచ్చిన డబ్బునే పార్టీ కోసం ఖర్చు చేయాలి. నా వరకు రాజకీయాలు అంటే జాతీయ సేవ.
రైతులకు కావాల్సింది

గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర కావాలి. ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి రూ. 200 కోట్లు ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంటే.. ఎకరాకు రూ. 30 వేలు ఖర్చు పెట్టిన

రైతుకు మాత్రం కనీసం గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు. రైతులకు న్యాయం జరగాలి అంటే ఓట్లు కొనుక్కునే రాజకీయం నుంచి ఓట్లు కొనుక్కోని రాజకీయాలకు సమాజం

రాగాలిగితే లాభసాటి ధర వచ్చే వ్యవస్థను తీసుకురావచ్చని తెలిపారు.  

కుల మతాలకు అతీతమైన సమాజం మనది : . . .

ఏ దేవుడినైనా ప్రార్ధించు కానీ దేశాన్ని ప్రేమించు

ఇది భారతదేశం లక్షణం. భారతదేశం లౌకిక సమాజం అన్నారు. మత ప్రాతిపదికన ఎవరిపైన వివక్ష చూపించదు. ప్రతి భారతీయుడు గుండెల్లో లౌకిక భావన ఉంటుంది. కులాలు, మతాలకు

అతీతంగా ఉండే సమాజం మనది. హిందుత్వం అనేది జీవన విధానం. సీఏఏ, ఎన్ఆర్సీపై ప్రత్యర్ధి పార్టీలు ప్రజల్లో చాలా అపోహలు సృష్టించారు. భారతీయ పౌరసత్వం తీసేస్తారని

భయపెడుతున్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీలో అలాంటి విధానాలే ఉంటే బీజేపీతో జనసేన ఎందుకు కలుస్తుంది. ఈ విధానాల వల్ల ఎవరికి పౌరసత్వం ఇవ్వాలనే ఆలోచనే తప్ప.. ఉన్నవారికి

తీసేయాలన్న ఆలోచనే లేదు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి ముస్లిం దేశాల నుంచి మైనార్టీలను రక్షించుకోవడానికే à°ˆ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు.  
పార్టీ కోసం

నియోజకవర్గాల్లో క్రియశీలకంగా పని చేసిన కార్యకర్తలను వ్యక్తిగతంగా కలుసుకోవాలనే ఈ సమావేశాలు ఏర్పాటు చేశాం. ఈ సమావేశాల్లో జన సైనికులు మాట్లాడుతున్న ప్రతి

మాట జీవామృతంలా పని చేస్తుంది. ఎలాంటి ఓటములు ఎదురైనా ముందుకెళ్లే శక్తిని ఇస్తుంది. జనసేన పార్టీ ఇవాళ చేస్తున్న పోరాటం భావి తరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని.

విలువలు కోల్పోకుండా, డబ్బు ఆశించకుండా దేశానికి సేవ చేయాలనే పార్టీ పెట్టానన్నారు. 

మాటల్లో కాదు చేతల్లో చూపే పార్టీ మనది : . . . 

మనది మాటలు చెప్పే

పార్టీ కాదు.. చేతల్లో చూపించే పార్టీ. దానికి ఉదాహరణే రాజధాని రైతులకు à°…à°‚à°¡à°—à°¾ ఉండటం.  à°°à°¾à°œà°§à°¾à°¨à°¿ గ్రామాల్లో ప్రజలు మనల్ని నమ్మలేదు. ఓట్లు వేయలేదు. పార్టీ ఆవిర్భావం

జరిగినప్పడు అపహాస్యం కూడా చేశారు. ఇది ఎవరో చెప్పింది కాదు అక్కడి ప్రజలే చెప్పారు. కానీ రాను రాను ఆశయాలు, పోరాటాలు అర్ధమవుతున్నాయని అన్నారు. ఓట్లు వేసినా

వేయకపోయినా ప్రజా సమస్యలపై నిలబడే తత్వం. ప్రజలందరూ మనవాళ్లు అని పోరాటం చేయడంతో ఇవాళ బలమైన వ్యవస్థ ఉన్న తెలుగుదేశం కంటే కూడా జనసేన పార్టీనే ప్రజలు

నమ్ముతున్నారు. త్వరలోనే జనసేన పార్టీ రాజకీయ శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తుంది. ప్రతి డివిజన్ నుంచి 5 గురిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తాం. యువత, మహిళల నుంచి

కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలోపేతానికి చాలా అద్భుతమైన అవకాశమని దీనిని జనసైనికులు, నాయకులు సద్వినియోగం చేసుకొని

జనసేన ఖాతా తెరిచేలా కృషి చేయాల”ని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ

ఇంచార్జ్ సయ్యద్ జిలానీ పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam