DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీయర్ ఎదుట శిక్షణ ఇవ్వడం అంటే జీవన సాఫల్యమే. ..  

జిమ్స్ లో  à°µà°‚దలాది మంది వైద్య విద్యార్థులకు 

మెదడు స్పందించే కదలికలను మహత్తరంగా మార్చవచ్చు: 

సోషల్ మీడియాలో స్పందన కూడా à°’à°• à°•à°£ ఉత్పత్తే  .

యోగ సాధనే అన్నింటికీ ముక్తి దాయకం. . . 

జీయర్ సంస్థలతో ఎనలేని అనుబంధం :

ఎన్ ఎల్ పి  à°¶à°¿à°•à±à°·à°•à±à°²à± చింతల దంపతులు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం) : . . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 02, 2020 (డిఎన్‌ఎస్‌) : అపర రామానుజులుగా ఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి ఎదుట నిలవడమే ఎందరో మహాద్భాగ్యంగా

భావిస్తుంటారని, అలాంటిది  à°†à°¯à°¨ సమక్షంలో మనోవిజ్ఞాన తరగతులు నిర్వహించడం జీవన సాఫల్య పురస్కారం సాధించినట్టేనని చింతల దంపతులు తెలియచేస్తున్నారు. విశాఖ

నగరానికి చెందిన చింతల కృష్ణ, రాధ దంపతులు గత కొన్నేళ్లుగా వందలాదిగా శిక్షణా తరగతులు నిర్వహించారు. విశాఖపట్నం కేంద్రంగా వీరు ఎన్ ఎల్ పి శిక్షణ తరగతులు

నిర్వహిస్తూ, వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వైద్యులు,   

జీయర్ ఎదుట శిక్షణ ఇచ్చిన వారు ధన్యులు :చింతల కృష్ణ : . . .  

కేవలం తన నేత్ర దృష్టితోనే దేశ

విదేశాల్లో లక్షలాది మందిని ఆకట్టుకునే జనాకర్షణ కల్గిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామిని సైతం ఆకట్టుకునే విధంగా మాట్లాడడం అంటే జీవన సాఫల్య

పురస్కారం లభించినట్టే అని చింతల కృష్ణ తెలియచేస్తున్నారు. 
చిన్న జీయర్ స్వామి ఆదేశం మేరకు శంషాబాద్ లోని జీయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (జిమ్స్) లో

మనో విజ్ఞాన శిక్షణ ఇచ్చేందుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ సంస్థలో వైద్య శిక్షణ ఇచ్చే వైద్యులు, వైద్య విద్య నేర్చుకునే వందలాది మంది వైద్య విద్యార్థులకు శిక్షణ

ఇచ్చేందుకు శిభిరం ప్రారంభ సభకు విచ్చేసిన జీయర్ స్వామి,  à°¸à±à°®à°¾à°°à± మూడున్నర à°—à°‚à°Ÿà°² సమయం పాటు ఇతర కార్యాచరణ కూడా వాయిదా వేసుకుని శిక్షణ ఆద్యంతం పాల్గొనడం మా

అదృష్టం అన్నారు.     

ఒక మనిషి తాను స్పందించే తీరును మంచిగా మార్చుకోగలిగితే మనిషి మనోనేత్రం మహత్తరంగా దర్శనమిస్తుందన్నారు. వైద్య విద్యార్థులతో

మమేకమై ప్రత్యక్షంగా జరిపించిన సాధనా ప్రయోగాల ద్వారా వైద్యులు ఎంతో ఉన్నతంగా తయారు కాగలుగుతారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తాము నిర్వహించిన శిక్షణ తరగతుల

కంటే జిమ్స్ చేపట్టిన శిక్షణ శిబిరం జీవితకాలం తమకు అపురూప కానుకగా నిలుస్తుందన్నారు. 

నరాలను నూతనోత్సాహంగా పలికించవచ్చు: చింతల రాధ : . . . .

సరైన సాధన

చెయ్యడం ద్వారా నరాలను నూతనోత్సాహంగా పలికించవచ్చని చింతల రాధ తెలియచేస్తున్నారు. మనిషి మెదడులో కలిగే ఒత్తిళ్లను సునాయాసంగా అధిగమించవచ్చన్నారు.  à°•à±‡à°µà°²à°‚

చిన్నపాటి జాగ్రత్తలు, సాధన తో నిత్యం ఎదురయ్యే ఒత్తిళ్లను సైతం అత్యంత సునాయాసంగా అధిగమించవచ్చని తెలియచేస్తున్నారు. మనిషి మెదడులోని నరాలకు సరైన దిశ చూపించడం

ద్వారా మనిషి తన జీవన దశమార్చుకోవచ్చని తెలిపారు. మెదడు లోని నరాలను ప్రజ్వలింప చేయడంలో యోగ సాధన అవసరమన్నారు.   

సోషల్ మీడియాలో స్పందన కూడా ఒక కణ ఉత్పత్తే

 . . .

మనుషులు సోషల్ మీడియా లో స్పందించే తీరును ఆమె విశ్లేషించి ఆయా సమస్యలను వివరించారు. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి అంతర్జాల మాధ్యమాలలో కొందరు అతిగా

స్పందిస్తూ దూషణలకు దిగుతుంటే, ఇంకొందరు ఆనందంగా వ్యవహరిస్తుంటారన్నారు. వీటన్నింటికీ కారణం వారి మెదడు ఇచ్చే సందేశాల ప్రభావమేనన్నారు. ఒక మనిషి మెదడులో

కలిగే నాలుగు విభిన్న వైఖరులను వివరించారు.  à°®à±†à°¦à°¡à± లోని నరాలలో కణాలు స్పందించే తీరును నాలుగు రకాలుగా విభజించడం జరుగుతుందన్నారు. వాటిల్లో ఆనంద కల్గిన సమయంలో,

ఆవేదన కలిగినప్పుడు, ఆక్రోశం వచ్చినప్పుడు, అతిగా స్పందించే సమయాల్లోనూ మెదడు లోని కణాలు వివిధ రూపాల్లో ఉత్పత్తి అయ్యే లక్షణాలను సరైన చర్యతో మార్గ నిర్దేశం

చేయవచ్చన్నారు. 

ఎండోర్ఫిన్స్ :  à°®à°¨à°¿à°·à°¿ వ్యాయామం చేసినప్పుడు, గానీ, యోగ సాధన చేసినప్పుడు,   ఆశ్చర్యానికి లోనైన సమయాల్లో, ఒత్తిడి à°•à°¿ గురైనప్పుడు, తదితర

సమయాల్లో ఉత్పత్తి అవుతుంది. 

డోపామైన్ :  à°Žà°¦à±à°Ÿà°¿ వారిని అభినందించిన సమయాల్లోనూ, వారు విజయాలు సాధించిన 
సమయాల్లో కలిగే ఆనంద సమయాల్లో ఉత్పత్తి

అవుతుంది. 

సెరోటోనిన్ : à°ˆ విధమైన అనుభూతి ప్రధానంగా సోషల్ ప్రసార మాధ్యమాల్లో స్పందించే  à°¸à°®à°¯à°¾à°²à±à°²à±‹ ఉత్పత్తి అవుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో

అతిగా స్పందించడం, బ్లాగ్ లు వ్రాయడం, వార్తల రూపంలో బహిర్గతం చెయ్యడం వంటి సమయాల్లో à°ˆ సెరోటోనిన్ ఉత్పత్తి అవుతుంది.   

ఆక్సీ టోసిన్ : ఎదుటి వారిని ఆలింగనం

చేసుకునే సమయాల్లో, కరచాలనం చేసే సమయాల్లోనూ, ఆత్మీయత, ప్రత్యక్ష అనుబంధం కలిగినప్పుడు,  à°¶à°°à±€à°°à°‚తో ప్రత్యక్ష స్పర్శ కల్గిన సమయాల్లో à°ˆ హార్మోన్లు ఉత్పత్తి

అవుతుంది.  

మెదడు ను నియంత్రించగలిగే శక్తి యోగాభ్యాసానికే ఉందని, ప్రాణాయామం సహా, విభిన్న ఆసనాలను సాధన చేయడం ద్వారా నరాలను పూర్తిగా అదుపులో ఉంచవచ్చని

ఎన్నో ప్రయోగాల్లో నిరూపితమైందన్నారు. 

జీయర్ సంస్థలతో ఎనలేని అనుబంధం : . . . 

ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యవంలో నిర్వహించబడుతున్న నేత్ర

విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ, గత కొన్నేళ్లుగా శిక్షణ శిబిరాలు నిర్వహించామన్నారు. అయితే గతంలో తమ శిక్షణా శిబిరాల్లో జీయర్ స్వామి ప్రత్యక్షంగా

వీక్షించిన సందర్భాలు అతి తక్కువ అన్నారు. అయితే జనవరి 30  à°¨ జిమ్స్ లో ప్రత్యేకించి వైద్యులు, వైద్య విద్యార్థులకు నిర్వహించిన శిబిరంలో సుమారు 4 à°—à°‚à°Ÿà°² సమయంలో అయన

శిబిరంలో పాల్గొనడంతో పాటు స్పందించిన తీరు తమకు అత్యంత అరుదైన సమ్మానం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam