DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా యూనివర్సిటీ మరో ఘనకార్యం...బికాం లో బయోలాజి సర్టిఫికెట్ 

బి.కామ్ లో కెమిస్ట్రీ, à°¬à±‹à°Ÿà°¨à±€, జువాలజీ సబ్జెక్టు లను చదివినట్టు  డిగ్రీ ఇచ్చేసింది. 

విశాఖపట్నం, జూన్ 24 , 2018 (DNS Online ): BCoM. లో ఫిజిక్స్. చదివాను అని ఒక ప్రజా ప్రతినిధి

విజయవాడ ఎం ఎల్ ఏ జలీల్ ఖాన్ ఒక మీడియా ఇంటర్వ్యూ లో చెప్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతా పరిహాసం చేశారు. పైగా రాష్ట్ర అసెంబ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష

నాయకులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లు సైతం దీన్ని ఆస్వాదించిన ఘటనలు చూసాం. 
అయితే దీన్ని నిజం చేస్తూ... దానికి మించిన పరిహాసం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర

విశ్వ కళాపరిషత్ ( 90 ఏళ్ళు చరిత్ర కల్గిన ) బికామ్ పరీక్షలో ఏకంగా కెమిస్ట్రీ లోనే కాదు, బోటనీ, జువాలజీ సబ్జెక్టు లను చేర్చి  à°’à°• విద్యార్థికి ఒరిజినల్ డిగ్రీ

సర్టిఫికెట్టే  à°µà°¿à°¡à±à°¦à°² చేసేసింది.

90 ఏళ్లకు పైగా అత్యంత ప్రతిష్ట చరిత్ర కల్గిన ఆంధ్ర యూనివర్సిటీ పరువు ప్రతిష్టలు మంట గొలిపే విధంగా సిబ్బంది పూర్తి

నిర్లక్ష్యం వైఖరితో విధులు నిర్వహిస్తున్నారు అనే విషయం బహిర్గతమైంది. కామర్స్ విభాగం లో సైన్సు కు సంబంధించిన సర్టిఫికెట్ ఎలా ఇచ్చారో అర్ధం కాక

విద్యార్థులు, సంబంధిత కళాశాల ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థులు ఒరిజినల్ డిగ్రీ కొరకు చేసిన దరఖాస్తు తో పాటు తగిన ఫీజు చెల్లించారా లేదా, అని

ఎయు సిబ్బంది మాత్రమే చూసుకుంటున్నారు తప్ప, తాము సరిగ్గా పని చేస్తున్నామా లేదా అనేది మాత్రం పరిశీలించుకోవడం లేదు. 

ఏయూ లో ఎందరి తప్పో ఇది..

ఒరిజినల్

డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఏయూ లో సంబంధిత విభాగం లో సిబ్బంది, తయారు చేసిన సర్టిఫికెట్ ను ఆ విభాగపు సూపరింటెండెంట్ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆపై

అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా అవసరం బట్టి పరిశీలించాల్సి యుంటుంది. ఈ విద్యార్థి విషయం లో అవేమీ వీళ్ళు చూసినట్టు లేదు. ఏ మాత్రం అవగాహనా లేనివారికి సైతం

బీకామ్ లో కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అనేవి ఉండవు అని తెలుస్తుంది. అలాంటిది వేలకు వేలు జీతాలు తీసుకునే ఉన్నత విద్యావంతులు, విద్యాలయంలో అందరికీ

సర్టిఫికెట్లు ఇచ్చే అధికారులకు ఈ విషయం తెలియలేదు అంటే. . . . ఏయూ లో సిబ్బంది ఎంత శ్రద్దగా విధులు నిర్వహిస్తున్నారో తెలుస్తోందని విద్యార్థులు మండి

పడుతున్నారు. 

 

courtesy : pix To whomsoever it may concern...

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam