DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యవం లో భీష్మ ఏకాదశి వేడుకలు  

5 à°¨ భీష్మ ఏకాదశి, సామూహిక విష్ణు సహస్ర పారాయణ  

విష్ణు సహస్ర నామ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విజయవాడ /

విశాఖపట్నం, ఫిబ్రవరి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : మానవాళి మనుగడకు మహత్తర ఔషధాన్ని అందించిన భీష్మ పితామహునికి కృతజ్ఞతగా మాఘ శుద్ధ ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి వేడుకలను

జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కురుక్షేత్ర యుద్ధం లో నేలకొరిగిన భీష్ముడు, యుద్ధానంతరం విజేతలైన పాండవులకు చేసిన జ్ఞాన భోద ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

అని పేరు. భీష్ముడు అంపశయ్య పైనే ఉంది తానూ జీవితంలో సంపాదించిన విజ్ఞానాన్ని పాండవులకు తెలియచేసిన సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వాటికి ఆమోదం

తెలియచేసాడు కనుకనే ఆ స్తోత్రానికి పరిపూర్ణత వచ్చింది అని చెప్తారు. అంతటి వైభవ స్తోత్రం భీష్ముడు పాండవులకు చెప్పినది మాఘ శుద్ధ అష్టమి ( అదే రోజు భీష్ముడు

పరమపదానికి చేరుకున్నాడు) రోజు అయినా, మానవాళికి తెలిసిన రోజు ఏకాదశి కావడంతో ఇదే రోజున వేడుకలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేశ, విదేశాల్లో ఈ రోజు సాయంత్రం

సామూహికంగా భక్తులందరూ కలిసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యడం గొప్ప విశేషం. 

 à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ సమీపంలోని సీతానగరం  ( గుంటూరు జిల్లా తాడేపల్లి దరి) లో ఉన్న విజయ

కీలాద్రి కొండపై వేంచేసిన క్షేత్రం లో భీష్మ ఏకాదశి వేడుకలు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అపరరామానుజులుగా కొనియాడబడుతున్న చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష

పర్యవేక్షణలో జరుగనున్నాయి.  à°‰à°­à°¯ వేదాంత ఆచార్య పీఠం ఆధ్వర్యవం లో స్వామి వారి చే నిర్వహించబడుతున్న విజయకేలాద్రి కొండపై ఆలయ ప్రాంగణం లో బుధవారం భీష్మ ఏకాదశి

పర్వదిన వేడుకలు ఆరంభమవుతాయి సాయంత్రం చిన్న జీయర్ స్వామివారి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అనుగ్రహించ పడుతుంది.

విష్ణు సహస్ర నామ ఆవిర్భావ

దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో విజయకీలాద్రి à°•à°¿ రానున్నారు. 

ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్ద

సంఖ్యలో భక్తులను ఆహ్వానిస్తున్నారు.  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 
5 వ తేదీ జరిగే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు ముందు గా సీతానగరం

ఆశ్రమానికి చేరుకోవాల్సినదిగా ఆహ్వానిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam