DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధాని తర్వాత. . విశాఖ లో కాలుష్యం అరికట్టండి  

రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేసారు, విశాఖ ముంచేశారు. . 

కంపుకొట్టిస్తున్నారు, పందికొక్కుల్ని పెంచుతున్నారు 

మంత్రి అవంతి కి జగన్ గోల తప్ప జనం

గోడు పట్టదు . . .

టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మండిపాటు      

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . . . 

విశాఖపట్నం, ఫిబ్రవరి 06, 2020 (డిఎన్‌ఎస్‌)

:పోర్టు, వాహన కాలుష్యం తో కుళ్లిపోతున్న విశాఖనగరానికి శాశ్వత పరిష్కారం చూపించి, ఆ తర్వాతే రాజధాని గురించి ఆలోచించాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే

వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజ మెత్తారు. గురువారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంత కాలుష్యంతో జనం రోగాల బారిన పడుతూ

మంచాలపెట్టి పోతున్నా స్థానిక మంత్రి అవంతి కి జగన్ భజన తప్ప జనం గోడు పట్టని పట్టలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన భ్రష్టు పట్టిందని విమర్శించారు

మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు జగన్ గోల తప్ప ప్రజల గోడు వినిపించుకోవడం లేదన్నారు 

విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో కాలుష్యం విపరీతంగా

పెరిగిపోయిందని దాని నివారణకు ఎన్నో పథకాలను పరిశోధనలను చేపట్టడం కోసం కేంద్రం నుంచి సుమారు 15 కోట్ల రూపాయలు నిధులను సాధించ గలిగానని అయితే వాటిని

తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా విఫలం చెందిందన్నారు. 

కాలుష్యం సంగతి చూడండి - రాజధాని తర్వాత : . . . 

విశాఖపట్నం పోర్టు సంస్థ విడుదల చేస్తున్న

కాలుష్యానికి అదుపు చేసేందుకు విశాఖ వన్ టౌన్ à°ˆ ప్రాంతంలోని అన్ని విధులను అండర్ డ్రైనేజీ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో నెరవేర్చడం జరిగిందన్నారు.  à°…యితే

ప్రభుత్వం మారిన తరుణంలో ఈ ప్రాజెక్టులను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. దాంతో తిరిగి డ్రైనేజీ సిస్టం అంతా చెత్త గా మరి విశాఖ వాసులను భయపెడుతోందన్నారు.

పోర్టు కాలుష్యం నివారణకు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టడం కోసం నిర్మించి షెడ్యూల్ షెడ్ నిర్మించి దుమ్ము ధూళి పైకి లేవకుండా డా నీటితో తడిపే

ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. అయితే దాన్ని కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత తీసుకోలేదన్నారు ఇప్పటికే మొదలుపెట్టిన ప్రాజెక్టులను

సైతం సగంలోనే వదిలివేయడం పై కాంట్రాక్టర్లను నిలదీయగా రాష్ట్ర ప్రభుత్వం వన్ నిధులను నిలిపివేసిందని, తద్వారా తాము పని కొనసాగించలేని కొనసాగించలేని తేల్చి

చెప్పేసారన్నారు. ప్రాజెక్టులు పాతవి కాంట్రాక్టర్లు పాత వారే అయితే పనులు ఎందుకు ఆపేసినట్లు ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. 

కాలుష్యం అరికట్టండి -

రాజధాని కట్టండి : . . . . . 

ఇక రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేసేందుకు తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ అంతకు

ముందుగా దీనికి తగ్గ ఏర్పాట్లను ఇక్కడ విశాఖలో చేయవలసి ఉందన్నారు. గత ప్రభుత్వ కాలం లో వన్ టౌన్ ప్రాంతం, చావల్ మదుం, కాన్వెంట్ జంక్షన్, జ్ఞానాపురం, తదితర

ప్రాంతాల్లో విశాఖ పట్నం పోర్ట్ ట్రస్ట్ తో చర్చలు జరిపి భారీ సంఖ్యలో పచ్చని మొక్కలు నాటించగలిగామని, తద్వారా ఆ ప్రాంతంలోని కాలుష్యం శాతం తగ్గించామన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాలనూ నిలిపి వేయడంతో ఈ ప్రాజెక్ట్ కూడా నిలిపేశారన్నారు. ప్రస్తుతం ఈ

మొక్కలనీ ఎండిపోయి మోడుల్లా మారి మరింత కాలుష్యం పెరిగినా స్థానికుల మంత్రులు, అధికారులకూ పట్టింపులేదన్నారు. వీటి వల్లా పందికొక్కులు

పెరిగిపోతున్నాయన్నారు. వీటిని అరికట్టలేని స్థితికి చేరుకోడానికి కారణం ప్రభుత్వ యంత్రాంగం ఘోరం దెబ్బతిందన్నారు.     

రైల్వే జోన్ ఆతీ గతీ లేదు . . : . . .

.

ఇప్పడికే కేంద్రం ప్రకటించిన  à°µà°¿à°¶à°¾à°– పట్నం ప్రధాన కేంద్రంగా రైల్వే జోన్ ఎక్కడ ఆగిపోయిందో తెలియదన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక మంత్రులు,

ఎంపీలకు ఏమాత్రం భాద్యత లేదన్నారు. దీని పూర్తిస్థాయి ఏర్పాటుకు పూర్తి ఒత్తిడి తేవాల్సిన ఈ ప్రజా ప్రతినిధులు కళ్ళు మూసుకు పోయారన్నారు. గత ప్రభుత్వం హయాంలో

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించేందుకు కేంద్రం నుంచి ప్రకటన విడుదల చేయించామని, జోన్ ఏర్పాటు ప్రక్రియ ను కూడా మొదలు పెట్టడం జరిగిందన్నారు. అయితే దాన్ని

పూర్తిస్థాయి లో ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన భాద్యతను పూర్తిగా తుంగలోకి తొక్కిందన్నారు. 

22 ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు

వంచుతామన్నారు : . . . .

తమకు 22 మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళ మెడలు వంచి మరీ ఆంధ్రా కు ప్రత్యేక హోదా సాధిస్తామని వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ ఓట్లు కొల్లగొట్టిందన్నారు. వెంటనే రైల్వే జోన్ వెంటనే వచ్చేస్తుందని ప్రగల్బాలు పలికి ప్రజలను మభ్య పెట్టి నేడు కోట్లాది మంది ప్రజలను

పూర్తి గా నట్టేట ముంచారన్నారు. నేడు ప్రభుత్వాన్ని నిలదీస్తే తీయడానికి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసింది అన్నారు దీన్ని

వీళ్ళకి 22 మంది ఎంపీ సీట్లతో పాటు 151 మంది ఎమ్మెల్యేలను కూడా అప్పగిస్తే ప్రజలను వీళ్ళు ముంచారన్నారు.  

అర్హులను తొలగించారు - ఉద్యమిస్తాం : . . .

రాష్ట్రం

లోని ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి ని ఎంపిక చేసి మరీ వాళ్ళ పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగించారన్నారు. తద్వారా అమ్మ ఒడి పథకం, పింఛన్లు, రేషన్ కార్డులు రద్దు

చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి కాకుండా ఇతరులకు ఇవ్వడం à°ˆ ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేస్తోందన్నారు 

మంత్రి అవంతి పూర్తిగా డమ్మీగానే . . . . .

ఇక విశాఖ రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేవలం జగన్ జగన్ భజన చేయడం తప్ప మరొకటి చేయడం లేదని  à°‡à°• విశాఖలో ఎన్ని ఉన్నాయో కూడా ఆయనకు తెలియని

పరిస్థితి అన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా విశాఖలో అసలు ఎన్ని పర్యాటక కేంద్రాలు ఉన్నాయి లెక్క కూడా తెలియదన్నారు విశాఖ పర్యాటక మబ్బుగా మారుస్తానని

ప్రగల్భాలు చెప్పడం తప్పా ఆచరణ చేయడం ఆయనకు చేతకాని పని అన్నారు ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే అత్యంత శూన్య పరిస్థితి తీసుకువచ్చిన ఘనత ఆయన అన్నారు ఎప్పుడూ

ప్రతిపక్షాన్ని పెట్టడం తప్ప అసలు తాను జనానికి ఏమి చేయాలనుకున్నాడు అతనికి తెలియదు అన్నాడు రేపటి నుంచి విశాఖ నగరంలో ప్రభుత్వ పథకాల అమలు వైఫల్యంపై

తెలుగుదేశం పార్టీ అర్హులైన లబ్ధిదారుల తో కలిసి తీవ్ర నిరసనలు చేపడుతుందన్నారు విశాఖ కాంప్లెక్స్ దగ్గర లోని జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం దగ్గర సుమారు

3 వేల మంది మహిళలతో అమ్మ ఒడి పథకంపై నిరసనగా ఉదయం నుంచి ధర్నా చేస్తామన్నారు అదేవిధంగా గతంలో పింఛన్లకు అర్హులైన లబ్ధిదారులు అందరూ నేడు అనర్హులుగా

తొలగించబడ్డారు నిలువ నీడలేని వారు కూడా నాలుగు అంతస్థుల బిల్డింగ్ లో ఉన్నట్టుగా చూపించి లెక్కలు చూపించి లెక్కలు చూపించి అర్హుల జాబితా నుంచి తొలగించడం

జరిగిందన్నారు అయితే ప్రతిపక్షంలో ఉన్న లబ్ధిదారులకు అన్ని అర్హతలు ఉంటే వారికి వచ్చేదాకా నిరంతర పోరాటం చేస్తామని తెలిపారు అంతకుముందు విశాఖ దక్షిణ

నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు రానున్న కాలంలో తమ పార్టీ చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణను నిర్ధారించారు

ప్రభుత్వంపై శాంతియుత పోరాటం చేసి తమ హక్కులను సాధించుకుంటామని తెలిపారు ఇక విశాఖ రాజధానిగా అభివృద్ధి ఎవరికి ఇబ్బంది ఉండదని అయితే మిగిలిన ప్రాంతాల వారికి

నష్టం కలిగించే విధంగా ఉండకూడదన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam