DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మిలన్-2020 విజయవంతం చేయాలి, కలెక్టరు వినయ్ చంద్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : వచ్చే నెలలో విశాఖపట్నం లో జరిగే మిలన్ 2020 (మల్టీ లిటరల్ నావెల్ ఎక్సర్సైజ్)

కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు విశాఖ నౌకాదళానికి సహాయ సహకారాలు అందించాలని విశాఖపట్నం  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశించారు.

à°ˆ విషయమై శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నేవీ, పోలీసు, ఎయిర్ పోర్ట్,  à°µà°¿à°¶à°¾à°–పోర్టు, జీవీఎంసీ, విఎంఆర్ à°¡à°¿à°Ž, ఆర్టీసీ విద్యుత్ పర్యాటక శాఖ అధికారులతో

ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం మార్చి 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతుందన్నారు. ప్రపంచంలోని

హిందూ మహాసముద్ర ప్రాంత 41 దేశాలకు చెందిన నావికాదళ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతినిధులు జిల్లాలోని పర్యాటక ఒక

ప్రాంతాలను దర్శించారు ఉన్నారని చెప్పారు. మిలన్ సభ్యులకు నగరం ఘనంగా స్వాగతం పలకాలని, నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని, వారికే అవసరమైన అన్ని సౌకర్యాలు

కల్పించాలని ఆదేశించారు. విశాఖ ఆతిధ్యాన్ని ఆదరణను మరువ లేని రీతిలో ఏర్పాట్లు చేయాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు చారిత్రక అంశాలు, మన ప్రాంతంలోని ప్రాచీన

ఆధునిక నాగరికత, అభివృద్ధిని వారు ఆకళింపు చేసుకునే రీతిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు వస్తున్నందున భద్రతా వలయాన్ని ఏర్పాటు

చేయవలసి ఉంది అన్నారు. నౌకాదళ అధికారి మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మిలన్  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ జరుగుతుందని, à°ˆ సంవత్సరం విశాఖలో నిర్వహిస్తున్నట్లు

తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నున్న దక్షిణ ఆసియా ఆఫ్రికా యూరప్ లలోని 48 దేశాల కు చెందిన నౌకాదళ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు.

వారికి ఆతిథ్యం ఇచ్చి మన ప్రాంతాన్ని చూపించేందుకు అధికారులు తమకు సహకరించవలసినదిగా కోరారు.
        à°ˆ సమావేశంలో వి.à°Žà°‚ ఆర్ à°¡à°¿ à°Ž అడిషనల్ కమిషనర్ మనజీర్ జిలాని,

డీసీపీ రంగారెడ్డి, డిఆర్ ఓ ఎం శ్రీదేవి, జీవీఎంసీ జెడ్ సి శ్రీనివాస్, పోర్టు, నేవీ, విమానాశ్రయ మత్స్యశాఖ విద్యుత్ శాఖ పోలీసు కల తదితర శాఖల అధికారులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam