DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మందస వాసుదేవుని బ్రహ్మోత్సవాలకు వైభవోపేత ఏర్పాట్లు   

ఫిబ్రవరి 13 నుంచి 20 వరకూ 11 à°µ బ్రహ్మోత్సవాలు .  

జీయర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే బ్రహ్మోత్సవాలు . . . . 

17 న కల్యాణోత్సవానికి చిన్న జీయర్ స్వామి

రాక, 

జీయర్ త్రయ దర్శనం తో పులకించనున్న యాగ ప్రాంగణం 

14 వ శతాబ్దపు ఆలయానికి అత్యంత వైభవం. . .

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . . .

.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 08, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం జిల్లా మందసలో వేంచేసిన  à°¶à±à°°à±€ వాసుదేవ పెరుమాళ్ 11 à°µ  à°¬à±à°°à°¹à±à°®à±‹à°¤à±à°¸à°µà°¾à°²à± ఫిబ్రవరి 13 నుంచి 20 వరకూ అత్యంత వైభవంగా

జరుగనున్నాయి. 14 వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసిన తదుపరి అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉత్సవాల్లో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు

పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. à°ˆ ఉత్సవాల్లో ప్రతి రోజు ఆచార్యుల మంగళశాసనములు,  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు, వైదిక కార్యాచరణ, మంత్రం హవనం, సంగీత

విభావరి, నృత్య ప్రదర్శనలు, తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా సాగనున్నాయి.  à°ˆà°¨à±†à°² 20 వరకూ జరిగే à°ˆ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వాసుదేవ

పెరుమాళ్ళ అనుగ్రహం తో పాటు, ఆచార్యుల మంగళశాసనములు పొందవలసిందిగా ఆలయ నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. యాగ నిర్వహణలో అత్యంత వైభవోపేతమైన ఘట్టం à°ˆ నెల  17 నుంచి

రెండు రోజుల పాటు సాగనుంది. ఒక ప్రాంగణం లో ఒక జీయర్ స్వామి ( యతీశ్వరులు ) దర్శనమిస్తేనే జన్మ తరించిపోతుంది. అలాంటిది ఈ బ్రహ్మోత్సవాల్లో ఆద్యంతం ఇద్దరు జీయర్ల

దర్శనం కలుగుతోంది. ప్రత్యేకించి స్వామి కల్యాణోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు చిన్న జీయర్ స్వామి హజరవుతుండడంతో భక్తుల జన్మ తరించనుంది. ఒకే వేదికపై

ముగ్గురు జీయర్ల దర్శనం అమోఘం అద్భుతంగా కొనియాడబడుతోంది.        

జీయర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే బ్రహ్మోత్సవాలు . . . . 

ప్రస్తుతం జరుగుతున్న 11 వ

బ్రహ్మోత్సవాలు ఉభయ వేదాంత పీఠం పరంపర లో కొనసాగుతున్న జీయర్ స్వాముల ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నాయి. 
త్రిదండి అహోబిల జీయర్ స్వామి, త్రిదండి

దేవనాధ జీయర్ స్వామి à°² ప్రత్యక్ష పర్యవేక్షణలో à°ˆ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. 

17 న చిన్న జీయర్ స్వామి రాక :. . .

ఉత్సవాల్లో పాల్గొనేందుకు

ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య, ఉభయ వేదాంత పీఠాధిపతులు చిన్న జీయర్ స్వామి ఈ నెల 17 న రాత్రి జరుగనున్న స్వామి వారి కల్యాణ మహోత్సవం లో పాల్గొనున్నారు. 18 న యాగ ప్రాంగణం లో

స్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేయనున్నారు. 

ఉత్సవాల్లో నిత్య కార్యక్రమాలు ఇవే: . . . . 

ఫిబ్రవరి 13 à°¨  : క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామికి అభిషేకం,

అలంకారం, అర్చన, సుందరకాండ పారాయణ, భజన సంకీర్తనలు.

ఫిబ్రవరి 14 à°¨  : శ్రీ వాసుదేవ స్వామికి అభిషేకం, అలంకారం, విశేష అర్చనలు, సామూహిక లక్ష్మి పూజ, బ్రహ్మోత్సవ

అంకురారోపణ.

ఫిబ్రవరి 15 న ఉదయం : పల్లకి ఉత్సవం, విశేష గరుడ పూజ, సంతానార్ధులకు గరుడ ప్రసాద వితరణ, సప్తవరణం.

మధ్యాహ్నం 3 గంటల నుంచి జీయర్ నేత్ర విద్యాలయ

విద్యార్థి పరమేశ్వర రావు (ఈటీవీ ఫెమ్) చే సంగీత విభావరి. 

సాయంత్రం 5 గంటలకు మధుర వాక్ శిఖామణి సాతులూరి గోపాలకృష్ణమాచార్యుల చే ప్రవచనామృతం,  à°…నంతరం ప్రముఖ

నేపధ్య గాయకులూ నేమాని పార్ధసారధి చే సంగీత విభావరి. 

ఫిబ్రవరి 16 à°¨  : ఆదిత్య హృదయ సామూహిక పారాయణ,  à°²à°•à±à°·à±à°®à°¿ పూజ, నృత్యోత్సవం, ఎదుర్కోలు ఉత్సవం.

ఫిబ్రవరి 17 న

 :  à°¶à±à°°à±€ భూ సమేత వాసుదేవ స్వామి కల్యాణ మహోత్సవం. 

ఫిబ్రవరి 18 à°¨  : శ్రీవాసుదేవ ( శ్రీకృష్ణ ) పూజ, గోపాల సాగరం లో తెప్పోత్సవం.

ఫిబ్రవరి 19 à°¨  : రధోత్సవం, గోపాల

సాగరంలో చక్రతీర్ధం, హయగ్రీవ పూజ, ద్వాదశారాధన, శ్రీపుష్ప యాగం, మహాపూర్ణాహుతి. 

ఫిబ్రవరి 20 à°¨  : శ్రీవాసుదేవ స్వామి అభిషేకం, రామానుజ పూజ. 

ప్రతి రోజు జరిగే

వాహన సేవలు : . . . 

బ్రహ్మోత్సవాల్లో ఉదయం సాయంత్రం వివిధ వాహనాల్లో వేంచేసి, స్వామి, అమ్మవార్లు తిరువీధిలో వేడుకల్లో పాల్గొంటారు. 

ఫిబ్రవరి 15 న ఉదయం :

హనుమంత వాహనం, సాయంత్రం : శేష వాహనం.

ఫిబ్రవరి 16 న ఉదయం : కల్పవృక్ష వాహనం, సాయంత్రం : హంస , గజ వాహనం.
 
ఫిబ్రవరి 17 న ఉదయం : కల్యాణ మహోత్సవం, సాయంత్రం : గరుడ

వాహనం.

ఫిబ్రవరి 18 న ఉదయం : పొన్న వాహనం, సాయంత్రం : అశ్వ వాహనం, తిరుమంగై అల్వార్ దోపిడీ ఉత్సవం,

ఫిబ్రవరి 19 న ఉదయం : రధోత్సవం , సాయంత్రం :

మహాపూర్ణాహుతి.

ప్రవచన, సాంస్కృతిక కార్యక్రమాలు: . . .  

ప్రముఖ వేదపండితులు, ఆధ్యాత్మిక వేత్తలు యాగ ప్రాంగణం లో ప్రతి రోజు ప్రచనలు అనుగ్రహించనున్నారు.

 à°ªà±à°°à°¤à°¿à°°à±‹à°œà±‚ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రముఖ సంగీత నాట్య కళాకారులచే సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగనున్నాయి.  

మందస ఆలయ ప్రాశస్త్యం - వైభవం : . .

శ్రీకాకుళం జిల్లా మందస లో వేంచేసిన శ్రీ వాసుదేవ స్వామి ఆలయానికి, స్థల ప్రాశస్త్యం ఎంతో ఉంది. 14 వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ప్రాంగణం లోనే చిన్న జీయర్

స్వామి ఆచార్యులు, విశిష్టాద్వైత వైభవ సాధనా సారధి టికే గోపాలాచార్యులు (తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వాస్తవ్యులు) భగవద్రామానుజుల గ్రంధాలను అధ్యయనం

చేసిన పవిత్ర స్థలం. ఎందరో వేద పండితులు, విశిష్టాద్వైత ప్రవర్తకులు à°ˆ ఆలయాన్ని మంగళాశాసనం చేసిన ప్రాంగణం. 

1988 లో శ్రీకాకుళం ప్రాంతంలో విశ్వ శాంతిని

కాంక్షిస్తూ చిన్న జీయర్ స్వామి చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఈ మందస గ్రామానికి రావడం జరిగింది. అంత పవిత్రమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో చలించిన చిన్న

జీయర్ స్వామి ఉభయ వేదాంత ఆచార్య పీఠం ద్వారా ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ కావించి, పున: వైభవాన్ని అందించారు. ఈ మహోత్సవం జరిగిన తదుపరి ప్రతి ఏటా అత్యంత వైభవంగా

బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది 11 à°µ బ్రహ్మోత్సవాలు.   

మందస ఆలయానికి చేరుకునే మార్గం :  . . . 

విశాఖపట్నం నుంచి, శ్రీకాకుళం

నుంచి మందస కు నేరుగా బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. మందస గ్రామం పలాస రైల్వే స్టేషన్ కి 19 కి. మీ. దూరంలో ఉంది. మందస రోడ్ రైల్వే స్టేషన్ లో కూడా కొన్ని ట్రైన్స్

ఆగుతాయి. మందస రోడ్ రైల్వే స్టేషన్ నుండి మందస శ్రీ వాసుదేవ స్వామి ఆలయము 5 à°•à°¿.మీ. దూరంలో ఉంది.  

ఈ మహోత్సవం పాల్గొనదలచిన వారు వివరాలకు వాట్సాప్ నెంబర్ లలో

 à°¸à°‚ప్రదించవచ్చు. 9550338780 , 8341081114 , 9441869044 , 9440789038.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam