DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారాలు పొందండి:

నేషనల్ లోక్ అదాలత్ లో జిల్లా జడ్జ్ ఎమ్ బబిత

వంశధారలో వందలాది కేసులు పరిష్కారం: డిఆర్ఓ దయానిధి 

సామాజిక భాద్యతగా అందరికీ ఉచిత వైద్య పరీక్షలు

 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . . . .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 08, 2020 (డిఎన్‌ఎస్‌) : దీర్ఘ కాలికంగా అపరిష్కృతం కానీ ఎన్నో సమస్యలను సత్వరం

సానుకూలంగా పరిష్కరించుకునే సదవకాశం లోక్ అదాలత్ ద్వారానే లభ్యమవుతుందని శ్రీకాకుళం జిల్లా న్యాయాధికారి ఎం. బబిత వెల్లడించారు. శనివారం జాతీయ లోక్ అదాలత్

ప్రారంభోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ కార్యక్రమం లో శ్రీకాకుళం జిల్లా 5 వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంద నీ

చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వంటి సుదూర ప్రాంతాల నుండి లోక్ అదాలత్ లో కక్షిదారులు పాల్గొని సానుకూలంగా రాజీకి వస్తున్నారని తెలిపారు. నెల

రోజుల నుండి లోక్ అదాలత్ కార్యక్రమం కోసం ఏర్పాట్లు అయినట్లు తెలిపారు.  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్, ఎస్ పి లు సహకారం అందిస్తున్నారని చెప్పారు. ప్లాస్టిక్ నిషేధం కోసం,

పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు . 

అన్ని కార్యాలయాల్లో సౌచాలయాలు పరిశుభ్రంగా నిర్వహించాలని తెలిపారు . ఈ రోజు

కోర్టు ఆవరణ లో లోక్ అదాలత్ కార్యక్రమం కోసం వచ్చిన వారికి, న్యాయవాదులకు, మంచి నీరు, అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు

తెలియచేసారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా à°¡à°¿ ఆర్ à°“ దయానిధి మాట్లాడుతూ, వంశధార లో వందలాది కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా

అందరిలోనూ సామాజిక స్పృహను కల్గించడం కోసం రెడ్ క్రాస్, జెమ్స్ ఆధ్వర్యంలో ఇదే ప్రాంగణం లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా జడ్జి

ప్రారంభించి, ఆమె సైతం రక్తపోటు, మధుమేహ చికిత్సలు జరిపించుకున్నారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°‚ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జయలక్ష్మి, రెడ్ క్రాస్ సంస్థ వైస్

ప్రెసిడెంట్ పి జగన్ మోహన్ రావు, ఎడిషన్ ఎస్.పి, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam