DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర వాళ్లంటే అంత అలుసా - తడాకా చూపిస్తాం :

ఏపీ విభజన హామీల సాధన సమితి హెచ్చరిక 

విశాఖపట్నం, జూన్ 25 ,  2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ ను తక్కువగా అంచనా వేస్తున్న భారతీయ జనతా పార్టీపై ఆంధ్ర ప్రదేశ్ విభజన హామీల

సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం నగరం లోని ఆంధ్ర ప్రదేశ్ యువజన జె ఏ సి అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ కార్యాలయం లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ను కించపరుస్తూ కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు ఎద్దేవా చేయడాన్ని తక్కువ పట్టారు. రాష్ట్ర

వ్యాప్తంగా పార్టీల నేతలు ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు కనపడడం లేదని, ఏమాత్రం వీరికి కేవలం పార్టీ భజన తప్ప, ప్రజా సమస్యలపై పట్టింపు

లేదన్నారు. 
ఆంధ్ర ప్రదేశ్ యువజన జె ఏ సి అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తాను ఇటీవల పెద్ద తప్పు చేశానని, ఆంధ్ర ప్రదేశ్ ని  à°…భివృద్ధి పరుస్తారనే

నమ్మకంతో భారతీయ జనతా పార్టీలో చేరానని, అయితే ఎన్నికల అనంతరం బీజేపీ ఆంధ్రా కి చేసిన మోసంతో పార్టీని వీడి ప్రజాక్షేత్రం లోకి వచ్చానన్నారు. విభజన హామీల అమలు

కోసం అతి త్వరలో అన్ని విశ్వ విద్యాలయాల్లోనూ పర్యటించి, విద్యార్థుల్లో చైతన్యం పెంపొందిస్తామన్నారు. అనంతరం ముఖ్య అతిధులచే ప్రచార పోస్టర్ ను విడుదల

చేయించారు. విభజన హామీల అమలు, తీసుకోవాల్సిన చర్యలపై మంగళ వారం విశాఖ నగరం లో అన్ని ప్రజా సంఘాలు, మేధావుల సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్

సమావేశం నిర్వహిస్తున్నామని తెలియచేసారు. ఆంధ్ర ఉద్యమ సాధనకై విశాఖనగరం లోని పేదవాల్తేరు లో à°’à°• కార్యాలయం సైతం ప్రారంభించామన్నారు. 

కార్యక్రమం లో

పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ  à°¬à±€à°œà±‡à°ªà±€ నేతలు తమ స్థాయి తగ్గించుకుని వ్యవహరిస్తున్ననారని మండిపడ్డారు. రాష్ట్ర బిజెపి

అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తనకి తెలిసి తెలియని అంశాలపై విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఆంధ్ర ప్రాంత బీజేపీ నేతలు ఢిల్లీ నేతల అడుగులకు

మడుగులొత్తుతున్నారన్నారు. à°ˆ విలేకరుల సమావేశం లో పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam