DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వడ్డించిన విస్తరిలా ఉన్న ఆంధ్రా ని చింపిరి చేసారు.   

విస్తృత స్థాయి మీట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, ఫిబ్రవరి 11, 2020 (డిఎన్‌ఎస్‌) : ఎన్నికల ముందు ఆంధ్ర

ప్రదేశ్ వడ్డించిన విస్తరిలా తయారు చేశామని, వైఎస్ జగన్ మోహన్ తన చేతగాని తనం వాళ్ళ చింపిరి విస్తరిగా చేశారన్నారు. మంగళవారం విజయవాడ లో జరిగిన తెలుగుదేశం పార్టీ

విస్తృత స్థాయి సమావేశం లో ఆయన మాట్లాడుతూ గతం లో ఆరంభించిన ఎన్నో సంక్షేమ పథకాలకు గండి కొట్టారన్నారు. పోలవరం, అమరావతిని ఆపేశారు. మూడు రాజధానులు వ్యవహారం

అత్యంత ప్రమాదకరమని ఎందరో చెప్పినా అదే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. నాలుగైదు రెట్లు ఇసుక ధర పెంచేశారు. 

వన్‌ స్టేట్‌ -వన్‌ కేపిటల్‌, సేవ్‌

ఆంధ్రప్రదేశ్‌- సేవ్‌ అమరావతి సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామని à°ˆ సమావేశం  à°à°•à°—్రీవంగా తీర్మానం ఆమోదిస్తున్నదన్నారు.

లక్ష కోట్ల ఆదాయం సంపద

సృష్టించే నగరం అమరావతి అని, అదే తెలుగుదేశం అధికారం లో ఉంటే రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆదాయం వస్తుందని, 63 శాతం

ఆదాయం పట్టణ ప్రాంతం నుంచి వస్తుందని తెలిపారు. 
à°—à°¤ 56 రోజులుగా అమరావతిపై ఆందోళనలు జరుగుతున్నాయి. సుమారు  40 మంది రాజధాని రైతులు అమరులయ్యారన్నారు. ఇన్నేళ్లూ

ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. పోలీసులు అసభ్యంగా ప్రవర్తించినా మహిళలు వీరోచితంగా పోరాడారు. అమరావతిపై ఎన్ని అపవాదులు

వేయాలో అన్నీ వేశారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు.

ప్రపంచ ఖ్యాతిగా విశాఖ ను అత్యున్నతంగా సిద్ధం చేశాం : . .. . 

విశాఖ

మహా నగరాన్ని అత్యున్నతంగా సిద్దం చేశామని, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ మొదలు పెట్టమని, డేటా సెంటర్ వచ్చి ఉంటే మరింత ఉన్నతంగా ఉండేదన్నారు. వేలాదిగా

ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరిగేవి. మెట్రోను కూడా రద్దు చేసే పరిస్థితికి తీసుకు వచ్చారన్నారు. 


జీఎన్ రావు కమిటీ దారుణంగా రిపోర్టు ఇచ్చింది.ఎవరికీ

అవగాహన లేదు.. ఇష్టానుసారంగా రిపోర్టు ఇచ్చారు. వీటిపై జాతీయ మీడియా కూడా కథనాలు రాసింది.

అసెంబ్లీలోను, మండలి లోనూ టీడీపీ ప్రజాప్రతినిధులను

ప్రలోభపెట్టాలని చూశారు. చైర్మన్ నీతి నిజాయితీగా వ్యవహరించారన్నారు. 

విశాఖ లో  à°­à±‚సేకరణ జరిపేసుకున్నారు . . . .

ఇప్పడికే అధికార పార్టీ వైఎస్సార్

కాంగ్రెస్  à°¨à±‡à°¤à°²à± 32 వేల ఎకరాలు ఇప్పటికే కొని సేకరించేసుకున్నారు కాబట్టే విశాఖనే రాజధానిగా ఎంచుకున్నారని మండిపడ్డారు. వాల్తేరు, మధురవాడ, ఆనందపురం, రుషికొండ

వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లింది. వైసీపీ భూకబ్జాలను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ బయటపెట్టింది. విశాఖలో ల్యాండ్ పూలింగ్‌లో 6,111 ఎకరాలు తీసుకుంటామన్నారు అయితే,

మాజీ సైనికులకు ఇచ్చిన భూములు తీసుకోవాలని చూస్తున్నారు. 

ఈ విపత్కర సమయంలో వారందరికీ అండగా ఉండాలని, అమరావతి వాసులకు సంఫీుభావంగా నిలబడుతున్న 13 జిల్లాల

అశేష ప్రజానీకాన్ని ఈ సమావేశం అభినందిస్తున్నది.

జెఏసి తరఫున మిగిలిన ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేస్తున్న అమరావతి పరిరక్షణ పోరాటంలో తెలుగుదేశం పార్టీ

తనవంతు కర్తవ్యాన్ని చేపడుతుందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam