DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి సన్నిధిలో సంచలనాల ధోని ప్రణామాలు  

చికిత్స కోసం పుట్టపర్తి ఆసుపత్రికి  à°•à±à°°à°¿à°•à±†à°Ÿà°°à± కల్నల్ ధోని రాక 

సాయి సేవలకు ధనాధన్ ధోని మంత్రముగ్దులు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం

)

విశాఖపట్నం / అనంతరపురం , ఫిబ్రవరి 11, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రపంచ ఖ్యాతి గాంచిన సత్యసాయి దర్శనానికి ప్రసిద్ధ క్రికెటర్ కల్నల్ ధనాధన్ మహేంద్రసింగ్ ధోని వచ్చారు.

 à°­à°¾à°°à°¤ క్రికెట్ జట్టు వైద్య నిపుణులు, తన వ్యక్తిగత వైద్యనిపుణులు డాక్టర్ ముత్తు కుమార్ అనంతరపురం జిల్లా పుట్టపర్తి లో ఉన్నారని తెలుసుకుని అయన వద్ద చికిత్స

పొందేందుకు మహేంద్ర సింగ్ ధోని మంగళవారం పుట్టపర్తి à°•à°¿ చేరుకున్నారు. 

ధోని రాకతో ప్రశాంతి నిలయం సందడి గా మారింది. ప్రత్యేక విమరణంలో విమానాశ్రయం లో

దిగిన ధోని కి ప్రశాంతి నిలయం కమిటీ సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సాయి సన్నిధికి చేరుకొని ప్రణమిల్లారు. సత్యసాయి సేవ సంస్థల మేనేజింగ్

ట్రస్టీ ఆర్ జె రత్నాకర్, ఇతర సభ్యులు, ప్రశాంతి నిలయం సభ్యులు ధోనికి స్వామి ప్రసాదాన్ని అందించారు.  

అనంతరం ధోని సత్యసాయి సూపర్ స్పెషలిటీస్ ఆసుపత్రి కి

చేరుకున్నారు. అక్కడ ఆసుపత్రి లో అత్యాధునిక వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా జరుగుతున్నాయి అని తెలుసుకున్న ధోని అత్యంత ఆశ్చర్య పోయారు. ఆసుపత్రి డైరక్టర్,

ప్రముఖ వైద్యులు డాక్టర్ గురుమూర్తి నేతృత్వంలోని వైద్య బృందం ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలను వివరించారు.

క్రీడాకారులకు

అందించే వైద్య రంగంలో అత్యంత నిపుణులైన ముత్తుకుమార్ ప్రస్తుతం  à°²à°‚డన్ లో విధులు నిర్వహిస్తున్నారు. à°—à°¤ 15 సంవత్సరాలుగా పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషలిటీ

ఆసుపత్రి తో అనుబంధం ఉంది. ఏడాదికి రెండు సార్లు పుట్టపర్తి ఆసుపత్రిలో  à°…త్యుత్తమ సేవలు ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం పుట్టపర్తి లో ఉన్నందున ధోని ఆయన్ను

సంప్రదించేందుకు రావడం జరిగింది.  

 

 

Pix courtesy: thanks to whom so ever it may concern...

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam