DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సుపరిపాలనకు గ్రామ సచివాలయ వ్యవస్ధ: సభాపతి తమ్మినేని

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 13, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రజలకు సుపరిపాలన అందించుటకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ

తీసుకురావడం జరిగిందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో కొండవలస, విజయరామపురం గ్రామ పంచాయితీలలో నూతన

గ్రామ సచివాలయ భవనాలకు గురు వారం శాసన సభాపతి శంకుస్ధాపన చేసారు. ఈ సందర్భంగా శాసన సభాపతి మాట్లాడుతూ సచివాలయాల్లో 541 రకాల సేవలను ప్రజలకు అందించడం

జరుగుతుందన్నారు. ప్రతి వాలంటీరు,గ్రామ సచివాలయ ఉద్యోగికి మొబైల్ ఫోన్ అందజేస్తున్నారని, విధులను పక్కాగా నిర్వహించి ప్రజల మన్ననలను పొందాలని కోరారు. బియ్యం

కార్డు, పింఛను, ఆరోగ్య కార్డు తదితర అన్ని సేవలను స్ధానికంగానే లభిస్తుందని చెప్పారు. నిర్ధేశిత సమయంలో సేవలు అందించాలని స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం

ఇచ్చిందని తెలిపారు. ప్రతి సచివాలయానికి పూర్తి మౌళికసదుపాయాలు, ఇంటర్నెట్ కల్పించడం జరుగుతుందని తద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు సకాలంలో అందించుటకు కృషి

చేస్తున్నారని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించుటకు ప్రతి రోజు స్పందన కార్యక్రమాన్ని సచివాలయాల్లో నిర్వహించాలని ప్రభుత్వం సూచనలు

చేసిందన్నారు. రాష్ట్రానికి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి కావడం శుభసూచకమని పేర్కొంటూ ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. సచివాలయ వ్యవస్ధ

విప్లవాత్మకమైనదని సభాపతి పేర్కొన్నారు. రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టగా పేదవారు విద్యకు దూరం కాకూడదని అమ్మఒడి కార్యక్రమం చేపట్టారని చెప్పారు.

మత్స్యకారలులకు మత్స్యకార భరోసా, ఇంధనంపై రాయితీ కల్పించారని చెప్పారు.  à°ˆ నెల 15 నుండి 21à°µ తేదీ వరకు పింఛను, బియ్యం తదితర కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో 46 లక్షల మందికి రైతు భరోసా, అమ్మ ఒడి క్రింద 42,33,098 మంది తల్లులకు రూ.15 వేలు చొప్పున చెల్లించామని చెప్పారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ళ పట్టాలు మంజూరు చేయడం

జరుగుతుందని చెప్పారు. ప్రతి ఏడాది 6 లక్షల గృహాల నిర్మాణం చేపట్టుటకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పైర్కొన్నారు. à°•à°‚à°Ÿà°¿ వెలుగు కార్యక్రమంలో “అవ్వా – తాతలకు”

ఫిబ్రవరి 18న ప్రారంభిస్తున్నారని చెప్పారు. అవ్వా-తాతలకు గ్రామ సచివాలయాల్లో ప్రాధమిక నేత్ర పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. నాడు - నేడు కార్యక్రమంను

ఆసుపత్రులకు విస్తరిస్తరించి అభివృద్ధి చేయనున్నారని ఆయన సీతారాం పేర్కొన్నారు. జగనన్న విద్యా,వసతి దీవెన కార్యక్రమాలను ఫిబ్రవరి 24న ప్రారంభిస్తున్నట్లు ఆయన

చెప్పారు. సంవత్సరానికి రూ.20 వేలు పంపిణీ చేస్తారని దీనిని ఏడాదికి రెండు దఫాలుగా తల్లుల ఖాతాలో వేస్తారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 25 నుండి  à°µà°¸à°¤à°¿ దీవెన కార్డులు

జారీ చేస్తున్నట్లు చెప్పారు. మార్చి నెలలో  à°°à°œà°•à±à°²à±, దర్జీలు, నాయీ బ్రాహ్మణులకు ఆర్ధిక సహాయం, కాపు నేస్తం కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు

తెలిపారు. 
à°ˆ కార్యక్రమంలో తమ్మినేని చిరంజీవి నాగ్,  à°¸à°°à±à°¬à±à°œà±à°œà°¿à°²à°¿ మండల మాజీ à°Žà°‚.పి.పి కిల్లి సత్యన్నారాయణ,  à°ªà°¿.à°Žà°‚.సి.ఎస్ చైర్మన్ శివానంద బాబు, మాజీ జెడ్పిటిసి

సురవరపు నాగేశ్వరరావు, బేవర మల్లేశ్వరరావు, పేడాడ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam