DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సరిహద్దులు పటిష్ఠంగా ఉంటేనే దేశం సురక్షితం: . కలెక్టరు నివాస్

భారత సైనికుల త్యాగం అజరామరం, అనిర్వచనీయం 

సైన్యంలో 16 వేల మంది కు పైగా శ్రీకాకుళం జిల్లా వాసులే. . . 

పుల్వామా అమరవీరులకు శ్రీకాకుళం కలెక్టరు ఘన

నివాళి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం). . .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : భారత సైనికుల త్యాగం అజరామరం, అనిర్వచనీయం అని, దేశ

సరిహద్దులు పటిష్ఠంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలియచేసారు. గత ఏడాది ఫిబ్రవరి 14 న కాశ్మీర్ లోని పుల్వామా

ప్రాంతం లో ఉగ్రవాదుల ఘాతుక ఘటనలో అమరులైన 40 మంది భారత సైనికులకు శుక్రవారం ఆయన ఘన నివాళి అర్పించారు. శ్రీకాకుళం లోని గాంధీ మార్గ్ ఇండియా ఫౌండేషన్, చిక్కొలు

సేవా సైన్యం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబిలీ హాల్లో పుల్వామా అమరవీరుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఈ రోజు నిరసన దినంగా పాటించాలన్నారు. భారత సైన్యంలో అధికశాతం మంది

శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడం ప్రజలందరికీ గర్వకారణం అన్నారు. సైన్యం లో సుమారు 16 వేలకు పైగా సిబ్బంది వివిధ హోదాల్లో శ్రీకాకుళం జిల్లా వాసులు

దేశానికి సేవ చేస్తున్నారన్నారు. ఇల్లు, కుటుంబాలకు దూరంగా ఎక్కడో దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న వీరి ఆస్తులను, భూములను కొందరు ఆక్రమించుకోవడం

క్షమించరాని నేరమన్నారు. దేశానికి రక్షణగా నిలిచినా వీరి కుటుంబాలకు ప్రజలందరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సైనిక కుటుంబాలకు ప్రభుత్వం నుంచి లభించవలసిన

అన్ని వసతులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్ సి ఎస్ పాఠశాల విద్యార్థులు వీర సైనిక గాధను తెలియజేసే నృత్యాన్నీ ప్రదర్శించారు. ఈ సందర్బంగా పివిఎస్

రామ్మోహన్ ఫౌండేషన్ తరపున సైనిక సంక్షేమానికి రూ.40 వేల చెక్ ను అందజేశారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ కళాశాల ఎన్.సి.సి. అధికారి పొలినాయుడు, మద్రాస్ రెజిమెంట్ సుబేదార్ à°¡à°¿.జగన్నాధ

రావు , ఎన్.సి.సి. అధికారులకు సత్కరించారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో పలువురు సైనిక సిబ్బంది, కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam