DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హనుమాన్ వైభవాన్ని ప్రకటించిన పిచ్చుకపల్లి గోదావరి తీరం  

వైభవంగా హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, ఫిబ్రవరి 15, 2020 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరం సమీపం లోని ఆత్రేయపురం మండలం లో ని పిచుక లంక వద్ద గల గోదావరి తీరంలో మైసూర్ దత్త పీఠాధిపతులు గణపతి స్చచిదానంద ఆధ్వర్యవం లో హనుమాన్ చాలీసా

పారాయణ అత్యంత వైభవంగా జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం లో ముందుగా క్రియ యోగాసనాలు ప్రాణాయామం తదితర

శిక్షణా తరగతులు నిర్వహించారు. మహాలక్ష్మీ వ్రతం అత్యంత వైభవంగా భక్తులచే నిర్వహింప చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణ భక్తులు

పెద్ద సంఖ్యలో పాల్గొని తెలియజేస్తున్నారు. ఆత్రేయపురం మండలం పిచ్చుక లంక గోదావరి తీరంలో జరిగిన ఈ యజ్ఞంలో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద

సంఖ్యలో పాల్గొన్నారు.  

ఈ కార్యక్రమంలో స్వామీజీ మాట్లాడుతూ గంగా నది తీరాన హరిద్వార్, రిషికేశ్ లలో కూడా ఈ పారాయణ యజ్ఞం చేయాలని సన్ కల్పించినట్లు

తెలిపారు. గతంలో విశాఖ మహా విశాఖ నగర సాగర్ కాలంలోనూ చాలీసా పారాయణ జరిగిందన్నారు. దీనివల్ల ఒక ముహూర్తం లో నే లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసిన ఫలితం

లభిస్తుందన్నారు. దేశవిదేశాల్లో 13 వేల కోట్ల హనుమాన్ చాలీసా పారాయణ తో పాటు శ్రీ రామనామ జపం కూడా జరిగిందన్నారు. శ్రీ రామాయణానికి జాతి మతం కులం అనే భేదాలు లేవు 28

దేశాల్లో అంతర్జాలం ద్వారా ప్రచారం చేయడం జరిగిందన్నారు. ఏ దేశం వారైనా ఏ మతం మతం వారైనా సంగీత ప్రాధాన్యం గా జరిగే కార్యక్రమాలను ఆదరిస్తారు. ఇంతవరకు 80 దేశాలలో

సంగీతాన్ని ప్రచారం చేయడం జరిగిందన్నారు. గతంలో రాజమహేంద్రవరంలో కూడా పలు కార్యక్రమాలు చేపట్టారు. త్వరలోనే ఒక సంగీత కార్యక్రమం కూడా నిర్వహించకుండా

మన్నారు. 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమం లో రాజా

మహేంద్రవరం లోక్ సభ సభ్యులు మార్గాన్ని భరత్ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam