DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవంతి నాయకత్వంలో ఎన్నికల మీట్: ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యే డుమ్మా

గ్రాండ్ బే లో ఎమ్మెల్యేలతో మంత్రి అవంతి  à°°à°¹à°¸à±à°¯ సమావేశం 

ఎన్నికల సమరానికి ఎమ్మెల్యేలు తలమునకల సమావేశం.

స్థానికం లో ఓడిపొతే మంత్రి పదవి

మూన్నాళ్ళ ముచ్చటేనా? 

అవంతి నాయకత్వానికి ఎంవివి, డాక్టర్, అదీప్ రాజ్ లు నో అన్నారా ?

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, ఫిబ్రవరి 18, 2020 (డిఎన్‌ఎస్‌) : జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నాయకత్వంలో త్వరలో జరుగబోవు స్థానిక ఎన్నికల సమావేశాన్ని మంగళవారం

సాయంత్రం అత్యంత రహస్యంగా నిర్వహించారు. ఈ మీటింగ్ కి విశాఖ ఎంపీ, అనకాపల్లి ఎంపీ, పెందుర్తి ఎమ్మెల్యే లు డుమ్మా కొట్టారు. ఈ సమావేశం ద్వారా అధికార పార్టీ కి

విశాఖ  à°œà°¿à°²à±à°²à°¾ లో ఉన్న డొల్ల తనం బయటపడింది. 

త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో గెలవని జిల్లాల్లోని మంత్రులకు పదవి గండం తప్పదంటూ అధిష్ఠానం

హెచ్చరించిన నేపథ్యంలో తన పదవి నిలబెట్టుకునేందుకు జిల్లా కు చెందిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ నానా హైరానా పడుతున్నట్టు అధికార పార్టీ నేతలే

తెలియచేస్తున్నారు. దీనికోసం జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సారధ్యంలో మంగళవారం నగరంలోని గ్రాండ్ బె హోటల్ లో జరిగిన అంతర్గత సమావేశానికి

జిల్లాలోని శాసన సభ్యులు హాజరయ్యారు కానీ, విశాఖ నగరానికి చెందిన లోక్ సభ సభ్యుడు ఎంవివి సత్యనారాయణ, అనకాపల్లి లోక్ సభ సభ్యురాలు డాక్టర్ బివి సత్యవతి, పెందుర్తి

ఎమ్మెల్యే అదీప్ రాజ్ లు డుమ్మా కొట్టారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి విజయం లభించని పక్షంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్ చర్యలు తీసుకోనున్నట్టు

ఇప్పడికే హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం లభించక పొతే తొమ్మిది నెలల తమ పరిపాలన ప్రజలకు నచ్చలేదనే విషయం తెలిసి పోతుందనే భయం జిల్లా

మంత్రి అవంతికి  à°®à±à°‚దు నుంచే భయం పట్టుకుందేమోనన్న అనుమానాలు పార్టీలోని కీలక నేతలే వ్యక్తం చేస్తున్నారు. à°ˆ నేపథ్యంలో నగరం లోని గ్రాండ్ బె హోటల్ లో మంగళ

వారం సాయంత్రం జరిగిన ఈ అంతర్గత సమావేశంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్, కారణం ధర్మశ్రీ, గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, అరకు లోక్ సభ సభ్యురాలు జి. మాధవి,

విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, పార్టీ నేతలు కేకే రాజు, అక్కరమని నిర్మల, ఇతర నేతలు పాల్గొన్నారు. 

విశాఖ జిల్లా

లో అధికార పార్టీ వైఖరి పై ప్రజల్లో కొంత వ్యతిరేక ఇప్పడికే మొదలైపోయినట్టు తెలుస్తోంది. ప్రధానంగా గ్రామీణ స్థాయిల్లో ప్రతిపక్ష పార్టీల పట్ల సానుకూలత

కలుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ కి విజయం గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినంత సులభం కాదన్నది వాస్తవం. ఇదే జరిగితే అవంతి మంత్రి పదవి తొమ్మిది నెలల పదవి కాలం

మూడు నాళ్ళ ముచ్చట లాగానే కనపడుతోంది. స్థానిక ఎన్నికల్లో ఓడిపోయే స్థానాల్లో మంత్రులకు పదవి గండం తప్పదన్నది దాని సారాంశం. ప్రస్తుతం జిల్లా మంత్రి తన పదవి

కాపాడుకోవాలంటే స్థానిక ఎన్నికల్లో విశాఖ జిల్లాలో అధికార పార్టీ కచ్చితంగా గెలిచి తీరాలి, లేని పక్షంలో మంత్రి పదవి లో మరొకరు వచ్చే అవకాశం పుష్కలంగా

కనపడుతోంది. దీనికోసం పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. అయితే కొందరు ఎమ్మెల్యే లు ఈ సమావేశానికి హాజరైనా, ఎంపీలు మాత్రం సమావేశానికి

డుమ్మా కొట్టడం ద్వారా అవంతి నాయకత్వం పట్ల వారు సుముఖంగా ఉన్నట్టు కనపడడం లేదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam