DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అబ్బో అబ్బో ఏమి జన సందోహం. . .ఆర్కే బీచ్ లో

కిటకిటలాడుతున్న బీచ్ రోడ్డు - ఇసకేస్తే రాలనంత జనం

భారీ స్థాయిలో వస్తున్న వాహనాలపై పోలీసు మార్కు బ్రేక్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): .

. .

విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2020 (డిఎన్‌ఎస్‌) : శుక్రవారం మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సాగరతీరంలో జరుగుతున్న à°’à°• కార్యక్రమంలో

పాల్గొనేందుకు విశాఖ జనం భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు.  à°µà±€à°°à°¿ రాకతో సాగరతీరం వాహనాలతో నిండిపోయింది. దీంతో వాహనాల రాక పోకల ను అదుపు చేసేందుకు పోలీసు

సిబ్బంది చాలా దూరంలోని అడ్డుకుంటున్నారు. దీంతో  à°‡à°¤à°° ప్రాంతాల్లో సైతం వాహనాలు నిలిచిపోతున్నాయి. సాగర తీరంలో వాహనాలు బారులు తీరడంతో పార్కింగ్ ప్లేస్ లేక

వన్ వే ట్రాఫిక్ అమలు లోకి వచ్చేసింది. నిత్యం రద్దీగా ఉండే బీచ్ రోడ్డు శివరాత్రి రోజు సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచే వాహనాల రాక తో నిండిపోయింది.  à°¦à±€à°‚తో

పార్కింగ్ ప్లేస్ లేక వాహనాలను వుడా పార్కు జంక్షన్ దగ్గర ఒక బ్రేక్ ఆల్ ఇండియా రేడియో దగ్గర మరొక బ్రేక్ అమలు చేస్తున్నారు. తద్వారా ఈ ప్రాంతం లో నివాసం వుండే

వారిని కూడా అడుగు ముందుకు కదలనివ్వడం లేదు. 

వాహనాలను బీచ్ రోడ్డు వైపు వెళ్లకుండా నిరోధించడంలో పోలీసులు కృతకృత్యులయ్యారని చెప్పాలి.  à°¦à±€à°‚తో

సాగరతీరంలో జరుగుతున్న శివరాత్రి వేడుకలు జనసంద్రంగా మారిపోయాయి. గతంలో చాలా పలుచగా తక్కువ సంఖ్యలో వచ్చే భక్తులు ఈ పర్యాయం కావడంతో ద్విగుణం, త్రిగుణం

కావడంతో రద్దీ తట్టుకోవడం కష్టం à°—à°¾ మారిపోయింది. అయితే నిర్వాహకులు భారీ స్థాయిలో ఏర్పాటు చేయడంతో వచ్చిన భక్తులు ఆనందంతో 
ఉబ్బి తబ్బిబ్బయ్యారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam