DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజకీయ రాబందుల నుంచి తెలుగును కాపాడుకుందాం 

ప్రపంచ మాతృభాషా దినోత్సవం తెలుగు వారధుల  à°†à°µà±‡à°¦à°¨ 

ప్రాధమిక విద్య మాతృభాషలో జరగాల్సిందే. . . . 

మార్చి 1 నుంచి తెలుగు దండు ఉద్యమానికి శ్రీకారం   

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2020 (డిఎన్‌ఎస్‌) : రాజకీయ రాబందుల నుంచి తెలుగు భాషను రక్షించుకుందాం మాతృభాషను కాపాడుకుందాం

అంటూ తెలుగు దండు సభ్యులు గళమెత్తి నిరసనలు తెలియజేశారు. శుక్రవారం ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ నగరంలోని మద్దిలపాలెం జాతీయ రహదారి

కూడలి వద్ద గల తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆమెకు పూల మాల వేసి నివాళి అర్పించి, మాతృభాషా దినోత్సవాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు భాష ప్రచార సారథి, తెలుగు దండు

వ్యవస్థాపకులు పరవస్తు ఫణిశయన సూరి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు తెలుగు భాషకు తామే పేటెంట్ అంటూ, తమ తర్వాతే తెలుగు భాష అని బట్టలు చింపుకొని

రోడ్డెక్కి దొర్లిన పెద్ద మనుషులు నేడు అధికార పదవి చేపట్టగానే ఇచ్చిన మాటను మురికి కాలవలో కలిపేశారన్నారు.  à°µà°¿à°¶à°¾à°– నగరంలో à°’à°• పెద్దాయన గతంలో తెలుగు భాష

వ్యాప్తికై జరిగిన ఉద్యమంలో అర్థనగ్నంగా అందరికంటే ముందు నుంచుని నానా హంగామా చేసిన ఘటన యావత్ తెలుగు సమాజం ఎప్పటికీ మరిచిపోదన్నారు. నేడు అధికార పదవి రాగానే

తెలుగు ఇతనికి రోతగా మారిపోయిందా అని ప్రశ్నించారు.  à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ వ్యక్తుల వలన తెలుగు భాష వైభవం పూర్తిగా భ్రష్టు పట్టి పోయిందన్నారు. ప్రజల్లో ఇలాంటి రాజకీయ

రాబందుల వలన ప్రజల్లో తెలుగు భాష కోసం ప్రచారం చేస్తున్న వారి పట్ల నిర్లక్ష్య ధోరణి తయారైందన్నారు. అయితే ఇలాంటి ఆషాడభూతులు, దుష్టచతుష్టయం ఆంధ్రాలో చాలామంది

ఉన్నారని ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందన్నారు.

ఆంగ్ల భాష కు వ్యతిరేకం కాదని అయితే ప్రతి పాఠశాలలోనూ ప్రాథమిక విద్య ఒకటవ తరగతి

నుంచి ఐదవ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాషలోనే ప్రతి విద్యార్థి అభ్యసించ వలసిన అవసరం ఉందన్నారు. ఐదవ తరగతి లోనే ఆంగ్ల నేర్చుకుంటే అర్జెంటుగా అమెరికా

వెళ్ళిపోతారా?  à°²à±‡à°¦à°¾ à°ˆ విద్యార్థి à°•à°¿ ఏబిసిడి రాయడం వచ్చు కదా అని ప్రభుత్వాలు  à°‰à°¦à±à°¯à±‹à°—ాలు ఇచ్చేస్తాయా? అనే సూటిగా ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. 

ఇలా నిర్బంధ

ఆంగ్లవిద్య పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చాలా తప్పుడు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం పెడతానంటే రోడ్డెక్కి నిరసన చేసిన

విశాఖ ఘనుడు నేడు అధికారం కోసం అధికార పదవి కోసం బట్టలు చింపు కుంటున్నాడన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పుడు నిర్ణయం అయితే సరిదిద్ద

వలసిన బాధ్యత మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఇతర పెద్ద మనుషులపై ఉందన్నారు.  à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ సునిశిత అంశాలను  à°–చ్చితంగా ఇది తప్పు అని నిర్ద్వందంగా తెలియజేయాల్సి

ఉంటుందన్నారు. అయితే à°ˆ రాజకీయ రాబందులకు మాత్రం ప్రజల కన్నా పదవులే ముఖ్యం అని ప్రజలు ఎలా పోయినా పర్వాలేదన్నారు.  à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ వాళ్ళ వల్ల మొత్తం సమాజం

నష్టపోతుందన్నారు.

రాజకీయ పార్టీలకు చెందిన వారు అధికార పార్టీ చేష్టలకు తానా తందానా అంటున్నారు అంటే అది వాళ్ళ పార్టీ వైఖరి అనుకోవచ్చు. ప్రస్తుతం విశ్వ

విద్యాలయాల ఉపకులపతులు కూడా రాజకీయ పార్టీలకు తోకల్లాగా, తానా తందానా అనడం చాలా బాధాకరం అన్నారు. 

 à°µà±€à°³à±à°³à°‚దరికీ జీవితంలో మరిచిపోలేని చెప్పేందుకు

గుణపాఠం చెప్పేందుకు మార్చి 1à°µ తేదీ నుంచి తెలుగు సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాష ప్రచారానికి నిరసన గళాన్ని వినిపించ నున్నట్టు తెలిపారు.  à°—తంలో రెండు

నెలలపాటు విశాఖ జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు అయితే నాటి పాలకులు తెలుగు ప్రజలను తీరని ద్రోహం చేయడం కారణంగా

వాళ్లకి అధికారం కోల్పోయి కేవలం ఇరవై మూడు సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారన్నారు. నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే తప్పుడు నిర్ణయం

తీసుకుంటే ఇతనికి 23 సీట్లు కాదు కదా కనీసం మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తప్పు నిర్ణయాన్ని

తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగు భాషా పండితులు జి. సుబ్రహ్మణ్యం, ప్రజా గాయకుడు వర్ధమాన కవి దేవిశ్రీ, రచయిత మంత్రి

ప్రభాకర్, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ తెలుగు విభాగం విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యమకారుడు జె టి రామారావు తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam