DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యా ఋణం తీర్చుకోలేనిది, కేవలం కృతజ్ఞతే. : గంట్ల శ్రీనుబాబు

పూర్వ విద్యార్థుల కోసం..... విరాళం 2.20 లక్షలు 

గోపాల పట్నం జెడ్ పి స్కూల్లో పూర్వవిద్యార్థుల సందడి  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, ఫిబ్రవరి 23, 2020 (డిఎన్‌ఎస్‌) : విద్యా ఋణం ఎవ్వరూ తీర్చుకోలేనిదని, కేవలం కృతజ్ఞత మాత్రం చూపించగలమని జాతీయ పాత్రికేయ సంఘం కార్యదర్శి, వైజాగ్

జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తెలియచేసారు. ఆదివారం విశాఖ నగరం లోని గోపాలపట్నం జిల్లా పరిషత్ పాఠశాల  1987 - 88 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల

సంఘం సమావేశంలో అయన సమన్వయ కర్తగా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తానూ విద్యాభ్యాసం చేసిన పాఠశాల అభ్యున్నతికి కృషి

చెయ్యవలసిన భాద్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా తమకు ఉజ్వల భవిష్యత్ లభించడానికి దోహద పడిన విద్యాబ్యాసాన్ని అందించిన పాఠశాల మరింత ఎక్కువ మందికి

ఉజ్వల భవితను అందించగలదన్నారు. ఈ సమావేశం గోపాలపట్నం లోని శ్రీనివాస కళ్యాణ మండపం ప్రాంగణంలో జరిగింది. వివిధ హోదాల్లో స్థిరపడిన ఈ సంఘం విద్యార్థులు, తమ

యోగక్షేమాలను తెలియచేసారు. నాటి అనుభూతులను అందరితో కలిసి పంచుకున్నారు. తమ సహాధ్యాయుల స్థితిగతులను తెలుసుకుని, వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించే విధంగా

ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని శ్రీనుబాబు తెలిపారు. à°ˆ పిలుపు ఇవ్వగానే వెంటనే à°ˆ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు మొత్తం రూ.  2.20 లక్షలు విరాళాన్ని

సేకరించారు. మరింత మొత్తాన్ని సేకరించే ప్రయత్నం కూడా జరుగుతుందని వివరించారు. ఈ సందర్బంగా ప్రతి విద్యార్థి తమ స్థితిగతులను తెలియచేయాలని కోరారు.

విద్యార్థులంతా ఒక కుటుంబం వంటివారేనని, తమ పరిధిలో పూర్వ వైభవాన్ని పొందేందుకు అండగా నిలబడతామని ప్రకటించారు. సమాజ అభివృద్ధి లో భాద్యతగా పలు సామాజిక సేవా

కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. 

ఈ సందర్భంగా ఆటపాటలతో సందడి చేయడంతో పాటు పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు

నిర్వహించారు,.. 

మాజీ కార్పొరేటర్ జియ్యాని  à°¶à±à°°à±€à°§à°°à± మాట్లాడుతూ,, 33 ఏళ్ల క్రితం తామంతా ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నామని à°† తర్వాత కొన్ని సందర్భాల్లో

ఎప్పటికప్పుడు కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో తమ అసోసియేషన్ ద్వారా తాము చదువుకున్న హైస్కూల్ తో పాటు నిరుపేద విద్యార్థులకు సహాయం.

అందిస్తామన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులంతా రోజంతా ఆట, పాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఈ సమావేశం లో కొలుసు ఈశ్వరరావు, కర్రి

సత్తిబాబు, నక్కాన చంద్రశేఖర్, ప్రసన్న, కృష్ణ అప్పారావు, మద్దిల శ్రీను లక్ష్మణ్, శ్రీదేవి, శిడగం రాజేశ్వరి,  à°°à°®à°£à°®à±à°®,  à°®à±€à°¨à°¾à°•à±à°·à°¿ తో పాటు పలువురు పూర్వ విద్యార్థులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam