DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శుభలేఖల మాటున రూ. 5 కోట్ల విలువ డ్రగ్స్ అక్రమ రవాణా 

బెంగుళూరు విమానాశ్రయంలో పట్టివేత 

మధురై నుంచి ఆస్ట్రేలియా కు 43 కార్డుల్లో రవాణా  
 
(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి

24, 2020 (డిఎన్‌ఎస్‌) : బెంగుళూరు విమానాశ్రయం లో ఆస్ట్రేలియా కు పార్సెల్ చేస్తున్నబట్టల ప్యాకేజ్ లో సుమారు రూ. 5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల రవాణాను తనిఖీ అధికారులు

పట్టుకున్నారు. శుభలేఖలు మాటున అక్రమం గా ఈ రవాణా చేస్తుండడంతో స్కానింగ్ తో పట్టుబడింది. శుభలేఖలు అట్టల మధ్య ప్లాస్టిక్ కవర్ లో డ్రగ్స్ ను పెట్టి, సీల్ చేసి,

మధ్యలో శుభలేఖ పెట్టారు. 
అధికారుల సమాచారం ప్రకారం కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లో శుక్రవారం జరిపిన తనిఖీల్లో 43 డబుల్ ఫోల్డర్ పెళ్లి శుభలేఖల్లో సుమారు

80 కి పైగా ఏప్రిల్ 30 ,2020 న చెన్నై లో జరుగవలసిన ఒక పెళ్లి కి సంబంధించిన బట్టలతో పాటు ఈ శుభలేఖలు కూడా ఉంచి పార్సెల్ చేసారు. ఈ పార్సెల్ మధురై నుంచి ఆస్ట్రేలియా కు రవాణా

జరుగుతున్నట్టు సమాచారం. ఒక్కొక్క శుభలేఖలోనూ రెండు ప్యాకెట్లు ( ఒక్కొక్క పాకెట్ లో 125 గ్రాముల మాదక ద్రవ్యాలను పాలిథిన్ కవర్లలో) పెట్టారు. పార్సెల్ బుక్ చేసిన

వారిపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులు పెట్టినట్టు తెలుస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam