DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ గుళ్ల పై దాడి పై మంత్రి వ్యాఖ్యలు అవాస్తవం : బీజేపీ

మంత్రి బొత్స వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఫైర్

చర్యలు తీసుకుంటే పీఠాధిపతులు రోడ్డెందుకు ఎక్కుతారు? 

విశ్వహిందూ పరిషత్ విశాఖ ప్రాంత

ప్రముఖ్ సత్యనారాయణ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిపై

వెంటనే చర్యలు తీసుకున్నామని రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆంధ్ర ప్రదేశ్ 
బీజేపీ రాష్ట్ర కమిటీ

సభ్యులు డాక్టర్ కెవివి సత్యనారాయణ మండిపడ్డారు. విశ్వ హిందూ పరిషత్ విశాఖ ప్రాంత ప్రముఖ్ గా కూడా సేవలను అందిస్తున్నకెవివి మంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ

 à°¹à°¿à°‚దూ దేవాలయాలపై దాడులు చేసిన వాళ్లపై వెంటనే చెర్యలు తీసుకుంటే డజన్లకొద్దీ స్వామీజీలు, వందలాదిగా సాధుపరిషత్ సభ్యులు, వేలాదిగా హిందూ సమాజం à°ˆ రోజు న్యాయం

చేయమంటూ రోడ్డెక్కి నిరసనలు ఎందుకు చేస్తున్నారన్నారు. హిందూ వ్యతిరేక మతోన్మాద ముష్కరులు హిందూ ఆలయాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి

చర్యలూ తీసుకోలేదన్నారు. 

వరుసగా ప్రతి చోటా ఆలయాలపై దాడులు చేస్తూనే ఉంటె కేవలం ఒక్క చోట ఒక వ్యక్తిని అరెస్ట్ చూపి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాడులను

అరికట్టేశామంటూ ప్రకటనలు చెయ్యడం చూస్తే హిందూ ధర్మం పై వీళ్ళ à°•à°¿ ఉన్న చిత్తశుద్ధి బయటపడుతోందన్నారు.  à°ªà±ˆà°—à°¾ అతనికి మతి స్థిమితం లేదంటూ ప్రచారం కూడా

చేశారన్నారు. మతి స్థిమితం లేని వ్యక్తి దాడులు చేస్తుంటే మతిస్థిమితం ఉన్న పెద్దలు చర్యలు తీసుకోకుండా ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని భ్రష్టు

పట్టించేందుకు ఆలయాలపై విచ్చలవిడిగా భౌతిక దాడులు చేస్తుంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకు పోయిందన్నారు. ప్రజల నుంచి వస్తున్నా విమర్శల నుంచి తప్పించుకునేందుకు

ప్రభుత్వం, మంత్రులు తూతూ మంత్రంగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యవం లో హిందూ ఆలయాలకు రక్షణ కల్పించాలని నిరసనలు

చేస్తున్నామని, ప్రతి మండల రెవిన్యూ కార్యాలయం వద్దా ధర్నాలు చేసి, à°Žà°‚ ఆర్ à°“ లకు వినతి పత్రాలు సమర్పిస్తున్నామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam