DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాటరీ టికెట్ల విక్రయాల గుట్టు రట్టు - ముఠా అరెస్ట్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 26, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో నిషేధించబడిన లాటరీ టికెట్లు 
శ్రీకాకుళంలో

విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి, ముద్దాయిలపై కేసు నమోదు చేసినట్లు మహిళా పోలీసు స్టేషన్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ( ఇన్ ఛార్జ్ ) డి. యస్. ఆర్. వి. యస్. ఎన్.మూర్తి

తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం నగరంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషనులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డి,ఎస్.పి మాట్లాడుతూ రాష్ట్రంలో

నిషేధించబడిన లాటరీ టికెట్లను గవర్నమెంట్ ఆఫ్ బోడోలాండ్ పేరుతో 8 రకాల స్కీములు, గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ పేరుతో 3 రకాల స్కీములు గల లాటరీ టికెట్లను

కలకత్తా నుండి తెచ్చి జిల్లాలో విక్రయిస్తున్నట్లు చెప్పారు. పాలకొండ నివాసి, ప్రధాన నిందితుడు అయిన జల్లు నారాయణరావు తన అనుచరులైన టంకాల కామేశ్వరరావు, కరుబోతు

గిరిజా శంకరరావు, మళ్లా పాపినాయుడు, పొట్నూరు త్రినాథరావు, గండిపల్లి పాపారావు, సాహుకారి సత్యనారాయణ, నల్లాన రామదాసు, వడ్డి వెంకటరమణ, వడ్డి లక్ష్మణరావులతో కమీషన్

తీసుకొని గత 25 ఏళ్లుగా విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతీసారి లాగానే బుధవారం ( 26.02.2020 ) సాయంత్రం 04.00గం.ల సమయంలో జల్లు నారాయణరావు లాటరీ టికెట్లను తీసుకువచ్చి

పట్టణంలోని సల్మాన్ ఖాన్ గల్లీలో గల టంకాల కామేశ్వరరావు పాన్ షాపు వద్ద లాటరీ టికెట్లను విక్రయిస్తుండగా పోలీసులు సమాచారం తెలుసుకొని నిందితులను అదుపులోకి

తీసుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితుల నుండి 11 సెల్ ఫోన్లు, రూ.27,680/-ల నగదు, 5,309 లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ముద్దాయిలపై శ్రీకాకుళం రెండవ

పట్టణ పోలీసు స్టేషన్లో  38/2020 అండర్ సెక్షన్ 7(3) ఆఫ్ లాటరీస్ -రెగ్యులేషన్ యాక్ట్ 1998 క్రింద కేసు నమోదుచేసినట్లు ఆయన తెలిపారు.
       à°ˆ సమావేశంలో ట్రైనీ à°¡à°¿.యస్.పి శ్రీలత,

రెండవ పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ పి.వి.రమణ, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam