DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*హిందూ ధర్మాన్ని బ్రష్టు పట్టించేందుకేనా ట్రస్ట్ బోర్డులు ?*

*హిందూ గుళ్ళు రాజకీయ పునరావాస కేంద్రాలా?*

*ఉత్తర దక్షిణాలుంటే చాలా? అర్హతలు అవసరం లేదా?*  

*బీజేపీ రాష్ట్ర ఈసీ సభ్యులు à°¡à°¾ సత్యనారాయణ . . .* 

*(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )*
 
*విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2020 (డిఎన్‌ఎస్‌): ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రముఖ ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలక మండళ్లను నియమించింది.

విజయవాడ, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందే మరి కొన్ని ఆలయాలకు బోర్డు సభ్యులను

నియమించారు. వీళ్ళ హయాంలో హిందూ ధర్మం ఎలా నడుస్తోంది అనే అంశం పై బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ సత్యనారాయణ పార్టీల వైఖరిని తూర్పారబట్టారు. గతం లో ఆలయాల

అభివృద్ధి, హిందూ ధర్మం కోసం నిరంతరం శ్రమించేవారినే బోర్డుల్లో నియమించేవారు. రాను రాను ఈ బోర్డు లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. హిందూ దేవుడంటే

నమ్మకం, భక్తి, విశ్వాసం లేని వాణ్ని తీసుకు వెళ్లి ఏకంగా తిరుమల తిరుపతి లాటి అత్యున్నత ఆలయాలకు పాలక మండలిలో నియమించేస్తుంటే వీళ్లపై భక్తులకు విశ్వాసం ఎలా

ఉంటుందని ప్రశ్నించారు. 

విశ్వ హిందూ పరిషత్ విశాఖపట్నం ప్రాంత ప్రముఖ్ ఈ నియామకాలపై కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. హిందువుల రక్షణ కోసం నిలబడవలసి

ప్రభుత్వాలే వాటిని కూల్చే వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోకపోతే. .. ఇక ఆలయాలను ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. 

వీటిల్లో నియమితులైన వాళ్లలో ఎంతమందికి ఆలయాల

గురించి అవగాహనా ఉంది? హిందూ ధర్మం, వైశిష్ట్యం గురించి తెలుసు? అసలు ఆలయ కమిటీ స్థాయిలో ఉండేందుకు ఎంతమందికి అర్హత ఉంది? అధికార పార్టీకి చెంచా గిరి చేస్తేనో,

బురిడీ బాబాలు చెప్తే ఇలా పోస్ట్ లు ఇచ్చేస్తారా? ఇవే ప్రశ్నలు యావత్ హిందూ సమాజంలో వెల్లువవుతున్న సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు.  

హిందూ ధర్మం పై

పూర్తి విశ్వాసం ఉండి, నమ్మకం ఉండి, సేవ చేసేవారిని నియమించాలని డిమాండ్ చేశారు. పార్టీకి విశ్వాసంగా పనిచేస్తే పార్టీల్లో పదవులు ఇవ్వాలె తప్ప ప్రజలతో ముడిపడి

ఉన్న కమిటీల్లో చోటు ఎలా కల్పిస్తారని ముఖ్యమంత్రి ని ప్రశ్నించారు. పార్టీలకు ఆర్ధికంగా సాయం చేసే వాళ్ళకి, ఎవరో బురిడీ బాబాలు చెప్పారని ఇలా పదవులు ఇచ్చేస్తే

హిందూ ధర్మం పూర్తి గా భ్రష్టు పట్టి పోతుందన్నారు. నియమితులైన వాళ్లలో ఎంతమందికి ఆగమ శాస్త్రం గురించి తెలుసు, ఆలయ మర్యాదలు తెలియని వాళ్ళకి, కనీసం ఎలా

పలుకరించాలో కూడా తెలియని వాళ్లకి సభ్యులుగా ఆలయాల్లో సభ్యులుగా నియమిస్తే. .. ఫలితం ఇంకెలా ఉంటుందన్నారు.?

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam