DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశృంఖల సంప్రదాయాన్ని విశాఖకు తేవద్దు: ఎమ్మెల్సీ మాధవ్

*టిడిపి - వైకాపా ఎయిర్ పోర్ట్ లో సినిమా స్టంట్ పై మండిపాటు* 

*అధికార దాహంతో ప్రజలను ఇబ్బంది పలు చెయ్యొద్దు* 

*పార్టీల తీరుపై ఉత్తరాంధ్రా బీజేపీ

ఎమ్మెల్సీ మాధవ్ మండిపాటు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రశాంత వాతావరణంగా విశాఖ నగరానికి విశృంఖల,

భయానక దౌర్జన్యపు అలవాట్లను ప్రవేశ పెట్టవద్దని అధికార ప్రతిపక్ష పార్టీలపై   ఉత్తరాంధ్రా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. శనివారం విశాఖలోని

ఓ హోటల్ లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన రెండు రోజుల క్రితం విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఘటన పై ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రంగాన్ని

తూర్పారబట్టారు. జడ్ ప్లస్ కేటగిరి రక్షణవలయం లో ఉన్న ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడును గురువారం విశాఖ విమానాశ్రయంలో అధికార పార్టీ వైయస్సార్

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు చేతులు ముడుచుకుని వైనాన్ని ఆయన ఖండించారు. బాబు పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీ

కార్యకర్తలను నిలువరించలేకపోయిందన్నారు. అనుమతి లేకుండా అంతమంది జనం విమానాశ్రయం లో ఆ సమయంలో ఎందుకు ఉన్నారు అనే విషయం పై ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం

ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. రాష్ట్రంలో రెండు పార్టీల వైరాన్ని రెండు కుటుంబ అధికార దాహాన్ని నిలబెట్టుకునే విధానం లో ప్రజలను నానా ఇబ్బందులకు గురి

చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనుమతించని పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలు అంత భారీ సంఖ్యలో ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఈ

వివాదం ఇంతకుముందు ఎన్నడూ విశాఖ తెలియదన్నారు. అధికార దాహంతో మునిగి పోయిన ఈ రెండు పార్టీలు విశృంఖల భయానక వాతావరణాన్ని విశాఖ నగరంలో ప్రవేశపెట్టడాన్ని

పూర్తిగా ఖండించారు.  à°…ంతర్గత కుమ్ములాటలు నాలుగు గోడల మధ్య తేల్చుకోవాలని ఇలా బహిరంగంగా రోడ్డు రోడ్డు à°•à°¿ సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదన్నారు

ఒక ప్రతిపక్ష నాయకుని సుమారు 5 గంటల పాటు నడిరోడ్డు మీద నిలబెట్టడం అధికార పార్టీ పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. ఈ రెండు పార్టీల వైఖరి

కారణంగా ప్రయాణీకులు నానా అవస్థలు పడడంపై  à°¦à±€à°¨à°¿à°ªà±ˆ పార్టీలో చర్చ జరుగుతుందని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam