DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృద్ధి పట్ల గిరిజనులకు అవగాహన అవసరం

ఘనంగా అరకు ఉత్సవం ప్రారంభం. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°—ిరిజన ప్రాంతాలకు నిధులతో పాటు

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడం ప్రధానమని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం అరకులోయలో అరకు

ఉత్సవాలు కు ముఖ్యఅతిథిగా హాజరై తుడుము మ్రోగించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనాభివృద్ధికి సంక్షేమానికి తమ

ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ఎన్ని నిధులు విడుదల చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టినప్పటికీ అమాయకులైన గిరిజనులకు పథకాల

పట్ల అవగాహన లేకపోవడం మూలంగా ఆశించిన మేరకు అభివృద్ధి సాధించలేకపోతున్నారు అన్నారు. మూవీ తో పాటు ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్ లో ఈరోజు మీరు ఇక్కడ గిరిజన

సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ తెలియజేసి పర్యాటకంగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే ఎందుకు ఉత్సవాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధి

చెందుతూ ఇక్కడ అందరికీ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇలా అనేక పర్యాటక ప్రాంతాల చారిత్రక ప్రదేశాలు చాలా ఉన్నాయని

వాటన్నిటినీ కలుపుతూ టూరిజం రూట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టూరిజం ద్వారా అభివృద్ధి జరిగే

విధానాన్ని వివరించారు. పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ఉత్సవాలు గిరిజనుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతాయని చెప్పారు.
     à°—ిరిజన సంస్కృతిని ప్రతిబింబించే

విధంగా అరకు ఉత్సవ్ లో ఏర్పాటుచేసిన  à°¸à±à°Ÿà°¾à°²à±à°¸à± లో సామ బియ్యం చోడి అంబలి పనసకాయ వంటకాలు గుమ్మడి కూర సందర్శకులను విశేషంగా ఆకర్షించాయి. గిరిజనులు

సాంప్రదాయకంగా ఉపయోగించే తిరగలి, రోకలి, నాగలి, అడ్డాకుల తో తయారైన సామాగ్రి గిరిజన ప్రాంత సంస్కృతిని తెలియజేశాయి. పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన దింసా,

తదితర గిరిజన నృత్యాలు అందరిని అలరించాయి.
ఈ సమావేశంలో విశాఖపట్నం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి, చీఫ్ కోచ్, ఎన్. సూర్యారావు, తదితరుల ఆధ్వర్యవం లో

క్రీడల పోటీలు జరిగాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam