DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డీసీఎంస్ బలోపేతం దిశగా చర్యలు: - చైర్మన్ పి సాయిరాజ్ 

*(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .*

శ్రీకాకుళం, ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°œà°¿à°²à±à°²à°¾ సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంస్) బలోపేతం దిశగా

అన్ని చర్యలు తీసుకుంటామని డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ అన్నారు. అరసవల్లి డీసీఎంఎస్ కార్యాలయంలో శనివారం జరిగిన పాలకవర్గ సమావేశం లో పలు అంశాలపై ఆయన

చర్చించారు. సొసైటీల ఆదాయాన్ని పెంచేందుకు సంస్థకు చెందిన స్థలాలలో షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించడానికి, వృధాగా ఉన్న గోదాములకు మరమ్మతులు నిర్వహించి

వినియోగంలోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.  à°¨à±‡à°·à°¨à°²à± అగ్రికల్చరల్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాతీయ సంస్థలో

సభ్యత్వాన్ని కోరుతూ దరఖాస్తు చేయాలని నిర్ణయించారు. ఇందులో సభ్యత్వం దొరికితే జాతీయ స్థాయిలో కొబ్బరి,  à°œà±€à°¡à°¿à°®à°¾à°®à°¿à°¡à°¿ ఉత్పత్తులను కొనుగోలు చేయడం,  à°Žà°—ుమతులు

చేయడం వ్యవసాయేతర ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే సౌలభ్యం కూడా ఉంటుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి,  à°®à°¾à°®à°¿à°¡à°¿, జీడి,  à°ªà±ˆà°¨à°¾à°ªà°¿à°²à±, బొప్పాయి కర్బూజ à°«à°²

ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు కూడా నిర్ణయించారు. హైదరాబాద్ కు  à°šà±†à°‚దిన ముద్ర అగ్రికల్చరల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ తో

కలసి ఉద్దానం ప్రాంతం రైతులను ఆర్థికంగా చైతన్యవంతులను చేయడానికి  à°¡à±€à°¸à±€à°Žà°‚ఎస్ తో ఒప్పందం చేసుకోవడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సంఘం ప్రస్తుతం

చేస్తున్న వ్యాపారాలు, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు పూర్తిస్థాయిలో ఈ సందర్భంగా చర్చించారు. పాలకవర్గ సమావేశం డీసీఎంఎస్ మేనేజర్ ఎన్. విట్టల్ రావు,

డీసీసీబీ సీఈఓ దత్తి సత్యనారాయణ., గొండు కృష్ణమూర్తి, మీసాల రామారావు, బెజ్జిపురం రామారావు, బంటు దుర్గారావు, విశ్వాస రాయి లక్ష్మీనారాయణ, నర్తు గంగమ్మ తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam