DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏటీఎం లో వచ్చిన డబ్బును బ్యాంకు కు అందచేత

DNS News సూచన మేరకు తిరిగి బ్యాంకు కు అందజేత 

విశాఖ యువకునికి బ్యాంకు మేనేజర్ అభినందనలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం,

మార్చి 02, 2020 (డిఎన్‌ఎస్‌) : మన ప్రమేయం లేకుండా ఏటీఎం లో డబ్బులు వచ్చేస్తే ఎవరైనా జేబులో వేసుకుని ఇంటికే వెళ్ళిపోతారు. అలాంటిది విశాఖ నగరానికి చెందిన à°’à°• యువకునికి

భారతీయ స్టేట్ బ్యాంకు ఏటీఎం లో నుంచి పది వేలు రావడంతో ఆ సొమ్ము తనది కాకపోవడంతో తిరిగి ఆ సొమ్మును స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ శాఖా మేనేజర్ కు అందించి అందరి

అభినందనలు అందుకున్నాడు. వివరాల్లోకి వెళితే. . . విశాఖపట్నం రంగరీజు వీధికి చెందిన కొప్పుల అనిల్ కుమార్  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ నెల 29 (శనివారం) ఉదయం 10 గంటలకు విశాఖపట్నం రెడీనం

గార్డెన్స్ లోని ( పాత జైలు రోడ్డు) స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఏటీఎం కౌంటర్ లో తన ఖాతాలో నగదు చెక్ చేసుకునేందుకు వెళ్లారు. నగదు చెక్ చేసుకోడానికి వెళ్లి కార్డు

మిషన్ లో పెట్టగానే తక్షణం రూ. 10 వేలు నగదు బయటకు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ నగదు ఎవరిదో తెలియక, అక్కడ ఎవరూ లేకపోవడంతో, పైగా శనివారం బ్యాంకు కు సెలవు

కావడంతో, ఒక్కసారి అలోచించి ఇంటికి వెళ్ళిపోయాడు. 

DNS News సూచన మేరకు బ్యాంకు కు అందజేత: . . . 

ఈ నగదు ను అసలైన వ్యక్తులకు ఎలా అందించాలో తెలియచేయమంటూ సోమవారం

ఉదయం DNS news agency ప్రతినిధి ని సంప్రదించారు. దీంతో సరైన ఖాతాదారుణ్ని మనం వెతుక్కోవడం కష్టమని, తిరిగి ఈ నగదును ఏ ఏటీఎం కౌంటర్ నుంచి వచ్చాయో ఆ బాంక్ అధికారులకే తిరిగి

చెల్లించామని సూచించడం జరిగింది. తక్షణం అనిల్ కుమార్ విశాఖపట్నం ( పాతజైలు రోడ్)  à°°à±†à°¡à±à°¨à°‚ గార్డెన్స్ లో స్టేట్ బ్యాంకు శాఖా బ్రాంచ్ మేనేజర్ ను కలిసి విషయం

తెలియ చేసి, సంబంధిత ఖాతాదారునికి అందించామని కోరారు. తక్షణం బ్రాంచ్ మేనేజర్ ఆ నగదును అనిల్ కుమార్ చేతే స్టేట్ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించారు. ఈ సందర్బంగా

బ్యాంకు సిబ్బంది అనిల్ కుమార్ ను అభినందించారు. 

అనంతరం అనిల్ కుమార్ బ్యాంకు వారు ఇచ్చిన రసీదు నకలు కాపీ ని జతపరుస్తూ ఒక వ్రాత పూర్వక లేఖను విశాఖపట్నం

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సి ఐ కు కూడా అందించారు. 

అనిల్ కుమార్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ప్రతినిధి కొప్పుల భాస్కర్ సమీప బంధువు కావడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam