DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*గాజు గ్లాసు లో వేసేది కాషాయమా లేక కషాయమా ?*

స్థానిక ఎన్నికల్లో జనసేన - బీజేపీ కలిసే పోటీ: నాదెండ్ల 

పొత్తుల ప్రభావం స్థానిక ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. 

రెండు పార్టీల బరువు జనసేనే

 à°®à±Šà°¯à±à°¯à°¨à±à°‚దా?

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, మార్చి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : గ్రామా స్థాయి నుంచి బలపడాలి అనుకునే  à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ  à°•à±à°·à±‡à°¤à±à°°

స్థాయి లో పనిచేస్తున్న అధిష్ఠానం తమ గాజు గ్లాసులో పోసేది కాషాయమా లేక కషాయామా అనేది స్థానిక ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. 

కార్యకర్తల్లో చైతన్యాన్ని

కల్గించేందుకు జనసేన అగ్రశ్రేణి నాయకుల నుంచి నియోజక వర్గ స్థాయి వరకూ కష్టపడుతోంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ బొత్తిగా జనమే లేని భారతీయ జనతా పార్టీతో కలిసి

స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని నాదెండ్ల మనోహర్ ప్రకటించడం గమానార్హం. బీజేపీ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఏమాత్రం క్యాడర్ కాదు కదా, కనీసం చెప్పుకోదగ్గ నాయకులూ

పట్టపగలే కాగడా వేసి వీటిపైనా కానరారు. 

ఉత్తరాది ప్రాంతాల్లో బీజేపీ కి ఉన్న హవా ప్రభావంతోనే కేంద్రం లో అధికారం లోకి వచ్చింది తప్పితే. . . ఆంధ్ర లో ఆ

పార్టీకి  à°•à°¨à±€à°¸à°‚ డిపాజిట్లుకూడా రావడం లేదు. పైగా చాలా చోట్ల à°† పార్టీకి అభ్యర్థులే లేరు. ఇలాంటి అత్యంత వీక్ పార్టీ తో జతకట్టి ఆంధ్ర లో స్థానిక ఎన్నికల్లో

బరిలో నిలవడం అంటే బీజేపీ అభ్యర్ధుల ప్రచార బాధ్యతలను కూడా జనసేనే అభ్యర్థులే మొయ్యాల్సిన దుస్థితి నెలకొంది. ప్రజా సమస్యలపై పట్టు కాదు కదా, కనీసం అవగాహనా

కల్గిన అభ్యర్థులు పట్టుమని పదిమంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ లో లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి అత్యంత వీక్ పార్టీతో కలిసి స్థానిక ఎన్నికల్లో బరిలో

దిగడం అంటే అత్యంత సాహసోపేతమైన చర్యగానే కనపడుతోంది.

 à°œà°¨à°¸à±‡à°¨ కార్యకర్తలు తమ పార్టీ గుర్తు గాజు గ్లాసు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే అత్యంత

ఆవశ్యకమైన వస్తువుగా ప్రచారం చేస్తున్నారు. అలాంటి గ్లాసు లో నింపే పదార్థం కార్యకర్తల శ్రమకు ఫలితంగా ఉండాలి తప్ప వారికి మరింత భారమై కషాయం గా మారకూడదు.

ప్రసుతం జనసేన కాషాయం తో జతకట్టడం అంటే గాజు గ్లాసులో కషాయం గా మారనుందని విషయం ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. రెండు పార్టీలు విభిన్న అజెండాలతో ముందుకు

వెళ్తున్నాయి. జాతీయ స్థాయిలో అగ్రనేతలు కలిసినా, క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచెయ్యడం చాలా కష్టతరం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam