DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*పకడ్భందీగా ఇంటర్ పరీక్షలు : కలెక్టర్ నివాస్*

*(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .* 

శ్రీకాకుళం, మార్చి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్భందీగా

నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల తనిఖీలో భాగంగా బుధవారం ఉదయం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గల ప్రభుత్వ బాలుర జూనియర్

కళాశాలను కలెక్టర్ సందర్శించారు. అక్కడ విద్యార్ధులకు ఏర్పాటుచేసిన తీరుతెన్నులను, సి.సి.కెమెరాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేసారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుండి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయని అన్నారు. జిల్లాలో 98 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని, అందులో 50

ప్రభుత్వ ,48 ప్రైవేటు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 62,753  à°®à°‚ది విద్యార్ధులు పరీక్షలు వ్రాస్తున్నారని అన్నారు. ఈసారి

పరీక్షల నిర్వహణలో విద్యార్ధులు ప్రశ్నించేవిధంగా కమీషనర్ , ఇంటర్మీడియట్ విద్యా మండలి నూతన విధానానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫీజు

కట్టలేదని పరీక్షలకు హాజరుకానివ్వకపోవడం, దీనివలన విద్యార్ధులు ఆందోళనకు గురికావడం వంటివి గతంలో జరిగేవని, ఆర్ధిక పరిస్థితుల వలన ఎవరైనా ఫీజు

కట్టలేకపోయినప్పటికీ  à°…టువంటివారు కూడా పరీక్షకు హాజరయ్యేందుకు ఈసారి అవకాశం కల్పించిన సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. ఇందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి

కమీషనర్ ను అభినందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈసారి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని,  à°ªà±à°°à°¤à±€ గదిలో సి.సి

కెమెరాలతో పాటు, విద్యార్ధులు టేబుళ్లపైనే పరీక్షలు వ్రాసేవిధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల్లోని వరండాల్లో సి.సి.కెమెరాల ఏర్పాటువలన

ఆగంతకులు ఎవరైనా తిరుగుతున్నారా, మాస్ కాపీయింగ్ వంటి విషయాలు తెలిసే అవకాశముందన్నారు.  à°ˆ కేంద్రానికి సంబంధించి ప్రిన్సిపాల్ ప్రత్యేక చొరవ తీసుకోవడం

హర్షదాయకమన్నారు. ఇందుకు ప్రిన్సిపాల్ ను అభినందిస్తున్నట్లు కలెక్టర్ à°ˆ సందర్భంగా తెలిపారు.  à°ˆ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణ

అధికారి                  ( ఆర్.ఐ.à°“) యస్.రుక్మాంగధరరావు , చీఫ్ సూపరింటెండెంట్ కె.వెంకటరావు, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ పి.ప్రకాశరావు, కార్యనిర్వాహక ఇంజినీర్

కె.సుగుణాకరరావు, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam