DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనాచారానికి ఆలవాలంగా అప్పన్న ఆలయం . . .??? 

వైష్ణవ స్వాములకు నిబంధనలు చెప్పే అర్చకులు ఏమయ్యారు?

*సంప్రదాయాలు, పద్ధతులు భక్తులకు మాత్రమేనా . . .*  

*పెద్దవాళ్లకు చెప్పలేం :  à°šà±‡à°¤à±à°²à±†à°¤à±à°¤à±‡à°¸à°¿à°¨

అప్పన్న అర్చకులు . . .* 

అర్చకులకు కనపడలేదా ? స్థానాచార్యులు భాద్యత విస్మరించారా? 

దేవస్థానమా లేక దెప్పిపొడుపుల సభా ?: ధార్మిక సంఘాలు  

(DNS రిపోర్ట్ : BVS

గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, మార్చి 05, 2020 (డిఎన్‌ఎస్‌) : లక్షలాది మంది భక్తుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ

స్వామి దేవస్థానం అనాచారాలకు ఆలవాలంగా మారుతోందని హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. బుధవారం ఆలయ à°…నువంశిక ధర్మకర్త à°—à°¾ నియమితులైన సంచయిత గజపతి రాజు

 à°¸à°¿à°‚హాచల క్షేత్ర పాలక మండలి చైర్మన్ à°—à°¾ భాద్యతలు చేపట్టారు. అయితే ఆలయంలో పాటించవలసిన నియమాలను ఆమెకు తెలియచేయక పోవడం ఆలయ ఆచారకులు, అధికారులదే పూర్తి à°—à°¾ తప్పు

అని ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ సంప్రదాయం లో మహిళలు జుట్టు వదిలివేయడం (విరబూసు కోవడం)  à°‰à°‚డదని, అయితే సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ à°—à°¾ పదవి

భాద్యతలు చేపడుతున్న సమయంలో సంచయిత జుట్టు వదులుగా ఉండడాన్ని అందరూ తప్పు పట్టారు. ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర

రావు, కాగా,  à°…దే సమయంలో ఆలయ అర్చకులు ఇతర సిబ్బంది అందరూ ఆమె పక్కనే ఉన్నారు. 

పెద్దవాళ్లకు చెప్పలేం :  à°šà±‡à°¤à±à°²à±†à°¤à±à°¤à±‡à°¸à°¿à°¨ అప్పన్న అర్చకులు . . .  

ఆలయ

ధర్మకర్తల మండలి చైర్మన్ అంటే ఆలయానికి సర్వోన్నత అధికారి  à°…ని, ఆమె మొదటి సారి ఆలయానికి వచ్చారని, అయినా ఆమెకు సంప్రదాయం గురించి మేము చెప్పలేమని ఆలయ అర్చకులు

చేతులెత్తేశారు. మేము భక్తులకు మాత్రమే హిందూ సంప్రదాయాలు, పద్ధతులు భక్తులకు మాత్రమే చెప్పగలమని, ఆలయ అధికారులకు మేము చెప్పకూడదు, చెప్పలేమని ఆలయ అర్చక

బృందంలోని పలువురు ఆవేదన వ్యక్తం చేసారు.  

వైష్ణవ స్వాములకు నిబంధనలు పెట్టె అర్చకులు ఎక్కడ?. . .

ఏడాది కి ఒకసారి సింహాచల క్షేత్రం లో జరిగే స్వామి

నిజరూప దర్శన సమయంలో సహస్ర ఘటాభిషేకం కోసం వచ్చే శ్రీవైష్ణవ స్వాములకు ఎన్నో ఆంక్షలు పెట్టె సింహాచల క్షేత్ర అర్చకులకు బుధవారం ఆలయ నిబంధనలు కనపడలేదన్నది

వాస్తవం. పైగా చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసేసమయం లో ఆమె ప్రక్కనే వీరు కూడా ఉండడం గమనార్హం. 

స్థానాచార్యులు భాద్యతను విస్మరించారా? . . . 

ఆలయం లో ఎటువంటి

సంప్రదాయం జరగాలి అనేది పూర్తిగా చూడవలసిన భాద్యత స్థానాచార్యులదే. అయితే బుధవారం చైర్మన్ బాధ్యతల స్వీకార సమయంలో అక్కడే ఉండవలసిన స్థానాచార్యులు ఎక్కడ

ఉన్నట్టు? ఒకవేళ అక్కడే ఉంటె ఆమెకు ఆలయ సంప్రదాయం చెప్పవలసిన భాద్యత విస్మరించారా అని హిందూ ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 

వైష్ణవ స్వాములకు వంకలు

పెట్టె స్థానాచార్యులు, ఇతర అర్చకులు తాము చెయ్యవలసిన విధి నిర్వహణలో ఘోర తప్పిదాలు చేయవచ్చా అని మండిపడుతున్నాయి. 

ఇదే విషయం పై ఆలయ అర్చకులు ఒకరిని

సంప్రదించగా, చైర్మన్ గా భాద్యతలు చేపట్టేన వారితో ఎవరికీ పెద్ద గా పరిచయం లేదని, మొదటి సారి ఆలయానికి వచ్చినప్పుడే ఆలయ నిబంధనలు చెప్పలేమని

చేతులెత్తేశారు. 

ఆలయంలో నిబంధనలు మొదటి సారి వచ్చినవారికి అమలు కావా? లేదా చైర్మన్ కు నిబంధనలతో పనిలేదా అనే విషయం ఆలయ స్థానాచార్యులు చెప్పవలసి

ఉంది. 

అధికారులకు ఆలయ మర్యాదలు, సంప్రదాయాలు తెలియవలసిన అవసరం లేదు. పైగా ముఖ్యమంత్రి, మంత్రులు, దేవాదాయ శాఖా అధికారులు ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సిందే

తప్ప ప్రశ్నించలేరు. అయితే ఆలయం మర్యాదలను కాపాడవలసిన భాద్యత కేవలం అర్చకులదే. అలాంటిది అర్చకులు తమ భాద్యతలను పూర్తిగా విస్మరించారాన్నది

వాస్తవం. 

దేవస్థానమా లేక దెప్పిపొడుపుల సభా ? : . . . 

వరుసగా అప్పన్న ఆలయంలో అనాచారం జరుగుతూనే ఉంది. దీన్ని సరిదిద్దవలసిన అధికారులు ఎవరెలా పొతే మాకేంటి

అనే ధోరణిలోనే ఉన్నారు. దీని à°•à°¿ నిదర్శనమే గురువారం జరిగిన సింహాచల దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార సభ.  à°ˆ సభ కేవలం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

వరకే పరిమితం కావాల్సి యుండి. అయితే ఈ సభకు హాజరైన ప్రజా ప్రతినిధులు ఇదేదో రాజకీయ వేదిక అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీల సభ్యులను విమర్శించడం గమనార్హం. ఇదే వేదిక

పై ఆలయ అధికారులు కూడా ఉండడం కొసమెరుపు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam