DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంచయిత సస్పెన్షన్ కై బీజేపీ అధిష్ఠానానికి లేఖ వ్రాసాం    

అశోక్ కు మద్దతు ఇవ్వలేదు, రూల్స్ పాటించమన్నాం. 

జీవో మార్పుతో భూ దోపిడీకి ప్రయత్నిస్తున్నారు 

బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ 
 
*(DNS రిపోర్ట్ : BVS

గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*

విశాఖపట్నం, మార్చి 06, 2020 (డిఎన్‌ఎస్‌) : భారతీయ జనతా పార్టీ విధి విధానాలకు విరుద్ధం à°—à°¾ సంచాయితా గజపతి రాజు వ్యవహరించిన

కారణంగా ఆమెను పార్టీ నుంచి బహిష్కరించామని అధిష్టానానికి లేఖ వ్రాసినట్టు బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సంచయిత ప్రస్తుతం బీజేపీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారని, ఆమెను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సింహాచల

క్షేత్ర ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా ఆమె రాష్ట్రం లో అధికారం లో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కొన్ని

వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టారు. దీనికి సంజాయిషీ కూడా కొరవలసిన ఆవశ్యకత లేకుండానే ఆమె భాద్యతలు చేపట్టిన సమయంలోనే ముఖ్యమంత్రికి, పార్టీ నేతలకు ధన్యవాదాలు

చెప్పడం యావత్ సమాజం చూసిందన్నారు. గురువారం విజయవాడ లో జరిగిన బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ నిర్వహించిన సమయంలో ఏకగ్రీవంగా ఆమెను పార్టీ నుంచి తొలగించమని

తీర్మానం చేయడమేకాక, కేంద్ర అధిష్టానానికి సిఫారసు చేయడం జరిగిందన్నారు. 

అశోక్ కు మద్దతు ఇవ్వలేదు, రూల్స్ పాటించమన్నాం. 

సింహాచల క్షేత్ర

పాలకమండలి సభ్యుల నియామకాన్ని చేపడుతున్నట్టు గత నెల 29 న ఒక జిఓ ను రాష్ర ప్రభుత్వం విడుదల చేసిందని, దానిలో చైర్మన్ గా ప్రస్తుత అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి ని

చైర్మన్ గా కొనసాగిస్తున్నట్టు ఉందన్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో మరో జీవో విడుదల చేసేసి, దాన్ని బయట కూడా పెట్టకుండా దొంగతనంగా రాత్రికి రాత్రి పేర్లు

మార్పు చేసి, గంటల వ్యవధిలోనే సంచయిత తో ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. అయితే అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని, అయినప్పటికీ ఆయనకు

అన్యాయం చేస్తూ అవమానించడాన్ని బీజేపీ పూర్తిగా తప్పు పట్టిందన్నారు.  à°ˆ నేపథ్యంలో తాము ఆయనకు మద్దతు ప్రకటించినట్టు కాదని, కేవలం నిబంధనలు పాటించక పోవడాన్ని

తప్పు పెట్టామన్నారు. 

జీవోల మార్పుతో మాన్సాస్ ట్రస్ట్ అధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూములను దోచేందుకు రాష్ట్ర అధికార పార్టీ ప్రయత్నిస్తోందని, దానిలో

భాగమే ఈ భూ దోపిడీకి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ భూములు స్వాహా చెయ్యాలంటే అశోక్ ఎట్టిపరిస్తుతుల్లోనూ అంగీకరించరని, అందుకే ఆయన స్థానంలో సంచయితను

నియమించి కోట్లాది రూపాయల విలువ కల్గిన వేల ఎకరాల  à°®à°¾à°¨à±à°¸à°¾à°¸à± ట్రస్ట్ భూములను కొట్టేసేందుకు భూ కుంభకోణానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే మూడు జిల్లాల

ప్రజలకు అభిమానపాత్రులైన గజపతి రాజులకు అవమానం జరగడాన్ని ప్రజలు ఒప్పుకోరన్నారు.  

ఈ సమావేశంలో విశాఖ ఉత్తర నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్

రాజు, విశాఖ నగర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి, రాష్ట్ర కమిటీ కార్యదర్శి సాగి విశ్వనాధ రాజు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam