DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంచయిత అభ్యర్ధన మేరకే చైర్మన్ మార్పు : 74 జీవో లో వెల్లడి 

మాన్సాస్ 74 జీఓ, సింహాచలం చైర్మన్ మార్పు 73 జీఓ లో స్పష్టం. 

కమిషనర్ కు డిసెంబర్ 4 నే సంచయిత లేఖ ఇచ్చినట్టు స్పష్టం 

ట్రస్ట్ ఆస్తుల పరిరక్షణ కోసమే

రొటేషన్ విధానం లో  à°šà±ˆà°°à±à°®à°¨à± మార్పు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, మార్చి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా

ప్రసుతం సంచలనంగా మారిన మాన్సాస్ ట్రస్ట్, సింహాచల క్షేత్ర ఆలయ ట్రస్ట్ చైర్మన్ మార్పు కేవలం సంచాయితా గజపతి అభ్యర్ధన మేరకే జరిగినట్టు దేవాదాయ శాఖా

వెల్లడించింది. à°ˆ మేరకు ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖా కమిషనర్ ఉషారాణి పేరిట విడుదలైన జీవో 74 లో వెల్లడవుతోంది.  à°¸à°¿à°‚హాచల క్షేత్రం, అనుబంధ 105 దేవాలయాల

అనువంశిక ధర్మకర్త ( చైర్మన్ ) à°—à°¾ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ దేవాదాయ శాఖా కమిషనర్ ఉషారాణికి  à°¡à°¿à°¸à±†à°‚బర్ 4 ,2019  à°¨à±‡ సంచయిత లేఖ ఇచ్చినట్టు స్పష్టం à°—à°¾ జీవో లో

పేర్కొన్నారు. అయితే à°ˆ వ్యవహారం లో పూర్తి సమీక్ష జరిపిన తదుపరి  à°®à°¾à°°à±à°šà°¿  3 , 2020 à°¨ జీవో 73 , 74 లు విడుదల చేసినట్టు తెలుస్తోంది.  à°œà±€à°µà±‹ 73 ను సింహాచల క్షేత్ర చైర్మన్ హోదా

కల్పిస్తూ, జీవో 74 ను మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ హోదాను కల్పిస్తూ దేవాదాయ శాఖా విడుదల చేసింది.  

రొటేషన్ పద్దతిలోనే మార్పు : . . . 

వేల కోట్ల రూపాయల

భూములు, ఆస్తులు కల్గిన మాన్సాస్ ట్రస్ట్ ఆస్తుల పరిరక్షణ కోసమే రొటేషన్ విధానం లో  à°šà±ˆà°°à±à°®à°¨à± మార్పు చేసినట్టు ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల్లో ప్రకటించారు.

గతంలో పివిజి రాజు, ఆయన మరణానంతరం ఆనంద గజపతి రాజు, తదుపరి అశోక్ గజపతి రాజు కుటుంబాలకు చైర్మన్ పదవి సంక్రమించిందని,  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚  à°¤à°¿à°°à°¿à°—à°¿ ఆనంద గజపతి రాజు

కుటుంబానికి చైర్మన్ పదవి రావాల్సి యుందని, à°† క్రమం లోనే సంచయిత గజపతి రాజు నియామకం జరిగిందని జీవోలో ప్రకటించారు. 

ఈ జీవో లో ప్రకటించబడిన అంశాల ప్రకారం. .

.. 

ప్రస్తుతం అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతి రాజు ( పివిజి రాజు కుమారులు) ఉన్నారని, వీరు ట్రస్ట్ వ్యవస్థాపకులు పివిజి రాజు కుటుంబ సభ్యులుగా ఉన్నారన్నారు.

 

అదితి గజపతి రాజు ( అశోక్ గజపతి రాజు కుమార్తె) బోర్డు సభ్యులుగా ఉన్నారని, వీరు కూడా ట్రస్ట్ వ్యవస్థాపకులు పివిజి రాజు (మనుమరాలు)  à°•à±à°Ÿà±à°‚à°¬ సభ్యులుగా

ఉన్నారన్నారు.  

అయితే సంచయిత గజపతి రాజు ( ఆనంద గజపతి రాజు కుమార్తె ) , ట్రస్ట్ వ్యవస్థాపకులు పివిజి రాజు (మనుమరాలు) కుటుంబ సభ్యులుగా ఉన్నారన్నారు.  à°ˆà°®à±†

అభ్యర్ధన మేరకు ట్రస్ట్ ఆస్తులను పరిరక్షించేందుకు చైర్మన్ మార్పు చేయడం జరిగింది. 

ఈ మార్పులను తెలియ పరుస్తూ ట్రస్ట్ చైర్మన్, సభ్యులు అందరికీ లేఖలను

పంపడం జరుగుతోందని తెలిపింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam